మరింత చౌక ఈ వేసవిలో విమానయానం.

Updated:14/04/2018 04:22 AM

less rates of flight tickets in this year

వేసవి అంటే సెలవులు.. సెలవులంటే విహారయాత్రలు..’ అవును మరి పిల్లల స్కూళ్లు, కాలేజీలకు సెలవులు వస్తాయి కాబట్టి చాలా మంది వేసవిలో ప్రయాణాలు పెట్టుకుంటారు. ఏ బంధువుల ఇంటికో.. పర్యాటక ప్రాంతాలకో వెళ్లి విహరిస్తారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటి వారికి ఇది శుభవార్త. ఈ వేసవిలో విమాన టికెట్ల ధరలు తగ్గనున్నాయట.

దేశీయ విమానాల్లో సగటున 4 నుంచి 9శాతం, అంతర్జాతీయ విమానాల్లో సగటున 19శాతం వరకు టికెట్‌ ధరలు తగ్గుతాయట. ఈ మేరకు యాత్రా, క్లియర్‌టిప్‌, ఇక్సిగో తదితర ట్రావెల్‌‌ వెబ్‌సైట్లు వెల్లడించాయి. డిమాండ్‌ పెరిగినప్పటికీ టికెట్‌ ధరలు చౌకగానే ఉండనున్నట్లు పేర్కొన్నాయి. ఒక్క దిల్లీ-ముంబయి సెక్టార్‌ మినహా మిగతా అన్ని దేశీయ మార్గాల్లోని విమానాల్లో టికెట్‌ ధరలు 9శాతం వరకు తగ్గుతున్నట్లు తెలిపాయి.

‘ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ టికెట్‌ ధరలు తగ్గుతాయి. ఎయిర్‌లైన్ల మధ్య పోటీతో పాటు సంస్థల సేవలు విస్తరిస్తుండటమే ఇందుకు కారణం’ అని యాత్రా యాజమాన్యం చెబుతోంది. ముఖ్యంగా మే మధ్యలో ఈ ధరలు మరింత తగ్గుతాయట. మరోవైపు ఇప్పటికే ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు కొన్ని స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, ఎయిర్‌ఏషియా లాంటి ఎయిర్‌లైన్లు డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా ప్రకటించాయి.

ఈ ఏడాది ప్రయాణికుల నుంచి డిమాండ్‌ కూడా 20శాతం పెరుగుతుందని ఈ వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి. ఇక మరి టికెట్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ‘హ్యపీ హాలిడేసే’ కదా..!

 

సంబంధిత వార్తలు

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR