కృష్ణాజిల్లా నీరుని ఆనకట్ట చెక్ డ్యాములుగా మార్చండి..

కృష్ణాజిల్లా నీరుని ఆనకట్ట చెక్ డ్యాములుగా మార్చండి..


( ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లేఖ రాసిన సేవ్ వాటర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కన్వీనర్ పేరం శివ నాగేశ్వరావు గౌడ్.. )
- నీటిని పొదుపు చేయవచ్చు.. సాగునీరు, త్రాగు నీరు పుష్కలంగా లభిస్తుంది.. 
  
                                                                                               
హైదరాబాద్, 11 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కృష్ణ జిల్లా నీటికి ఆనకట్ట, చెక్ డ్యాములు కట్టడం ద్వారా నీటిని పొదుపు చేయవచ్చు.. తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తుందని, ఈ దిశగా ఆలోచన చెయ్యాలని సేవ్ వాటర్ ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ కన్వీనర్ పేరం శివ నాగేశ్వర రావు గౌడ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కు ఒక లేఖ వ్రాశారు.. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని ఆయన సూచించారు.. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజి నుండి వచ్చే నీరు సముద్రంలో కలవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు.. సముద్రగర్భంలో కొన్ని లక్షల  క్యూసెక్కుల వరద నీరు వృధాగా పోవడం చాలా బాధాకరం..  కరువు రాకుండా చేసుకోవచ్చు.. ఆనకట్ట, చెక్ డ్యామ్  నిర్మాణం చేపట్టాలి.. చెక్ డ్యామ్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజిల్లా పరివాహ ప్రాంతం, కృష్ణాజిల్లా ప్రకాశం బ్యారేజీ వద్ద నుండి జగ్గయ్య పేట నుండి అవనిగడ్డ..  ఏలూరు నీటిపై చెక్ డ్యామ్ నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ శాసన సభ లో బిల్లు ప్రవేశపెట్టిన చెక్ డ్యామ్  ఆనకట్టను ప్రాజెక్ట్ ద్వారా నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.. కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచటం జరిగింది.. నీటిని నిలువ  చేయటం జరిగింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి బాగా పెంచడం జరిగింది.. తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నీటిని పొదుపు చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరగడం జరిగింది. కృష్ణ, గోదావరి జలాలని నీటిని రాయలసీమకు తరలించటం చాలా సంతోషకరమైన విషయం.    తమిళనాడు రాష్ట్రానికి కూడ ఇక్కడ ఉన్న నీటిని సముద్ర పాలు కాకుండా ఆనకట్ట చెక్ డాం ద్వారా నీటిని పొదుపు చేసుకుంటూ మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి కూడ మనం మంచినీరు సరఫరా చేయవచ్చు..   దానివల్ల రెండు రాష్ట్రాలకి స్నేహ సంబంధాలు, వ్యాపార సంబంధాలు కూడా  పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో, పార్లమెంట్ లో తాగునీటి, సాగునీటి  ఆనకట్ట చెక్ డాం నిర్మాణం కొరకు యుద్ధ ప్రాతిపదిక బిల్లు ప్రవేశపెట్టే గలరని ఆయన కోరారు.. రాజకీయ  పార్టీలకతీతంగా ఒక ప్రాజెక్ట్ ని విజయవంతం చేయగలరని ఆయన తన లేఖలో కోరారు..

Tags :