కేజీబీవీలో ఫుడ్ పాయిజన్!

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్!

- ఆదిలాబాద్, బేల మండలం కస్తూర్భా 
   గాంధీ స్కూల్లో ఘటన
- పస్తులుండి కొందరు, విషాహారం తిని 
  ఇంకొందరు అల్లాడుతున్న పేద బిడ్డలు 
- ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజనింగ్ ఘ‌ట‌న‌లే..
- 28 మంది విద్యార్థినులకు అస్వస్థత.. 
- రిమ్స్ లో చికిత్స.. కొందరికి సీరియస్.. 
- ముందురోజు చికెన్ తినడంతోనే ఘ‌ట‌న‌.. 
- పురుగుల అన్నం, పాచిపోయిన కూరలు.. 
- గాల్లో కలుస్తున్న పసి బిడ్డల ప్రాణాలు..
- ఈ ప్రభుత్వం ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తుంది..? 


తెలంగాణలో కార్పొరేట్ స్కూల్స్‎కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని సర్కార్ పదే పదే చెబుతున్నా..  ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మాత్రం రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది.. మౌలిక వసతులు కల్పించలేక పోగా, నాణ్యమైన భోజనాన్ని కూడా అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా మారింది పరిస్థితి. రాష్ట్రంలో వ‌రుస ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు రోజు రోజుకు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇప్ప‌టికే బాస‌ర ట్రిపుల్ ఐటీ లో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న మ‌రిచిపోక‌ముందే.. నిన్న‌టికి నిన్న అన్నంలో వాన‌పాము వ‌చ్చిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగు చూసింది. తాజాగా మ‌రొక‌టి…  ఈసారి ఆదిలాబాద్ జిల్లా, బేల మండ‌లంలోని క‌స్తూరిభా గాంధీ పాఠశాల‌లో పుడ్ పాయిజ‌న్ క‌ల‌క‌లం రేపింది. (ఇంట్రో)

హైదరాబాద్, 01 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :

ఆదిలాబాద్ జిల్లా, బేల మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 28 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు కెజిబివికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గత రాత్రి తిన్న చికెన్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. తరుచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయం బయటకు చేబితే టిసి ఇచ్చి పంపుతారన్న భయంతో విద్యార్థులు బయటకు సమాచారం చెరవేయలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కెజిబివి పాఠశాలలో మొత్తం 240 మంది విద్యార్థులున్నారు. అయితే గత మూడు రోజుల నుండి ఆహారంలో తరుచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. కాగా.. నిన్న చికెన్ తిన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి నుండి విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బేల కెజిబివి పాఠశాలలో ఉన్న మిగత విద్యార్థులు అస్వస్థతకు గురైన విద్యార్థులను చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా చేయలేదు. అయితే వారికి ధైర్యం కల్పించెందుకు మిగత టీచర్స్ వారి ముందు ఉదయం చేసిన మంచి భోజనాన్ని క్లాస్ రూమ్ లోకి వెళ్ళి వారి ముందు తింటున్నారు. ఈ భోజనం బాగుంది తినొచ్చని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమకు పురుగులతో కూడిన అన్నం పెడుతున్నారని, పాచిపోయిన కూరలు వడ్డిస్తున్నారని చెబుతూ విద్యార్థినిలు కన్నీటిపర్యంతం అయ్యారు.. ముందు రోజు తమకు చికెన్ పెట్టారని అది తిన్న తరువాతే తమకు ఫుడ్ పాయిజిన్ అయ్యిందని వారు తెలిపారు.. అన్నంలో పురుగులు వస్తుంటే తీసేసి తినమని సిబ్బంది తమను బెదిరిస్తున్నారని స్టూడెంట్స్ వాపోయారు.. మూడురోజుల నుంచి అన్నం తినలేకపోతున్నామని వారు అన్నారు.. ఉన్నతాధికారులు కల్పించుకుని తగిన అనుకూల పరిస్థితులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు..

Tags :