కాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం..

కాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం..


- మట్టుబెట్టిన భద్రతా బలగాలు.. 
- పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో కాల్పులు.. 
- కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది.. 
- ఇటీవల ఎస్సైని కాల్చి చంపిన ఘటనకు అతడే బాధ్యుడు.. 
- 3 రోజుల్లో 11 మంది టెర్రరిస్టుల హతం.. 
జమ్ము కాశ్మీర్, 21 జూన్ :
జమ్మూ కశ్మీర్ లో భారత జవాన్లు మరోసారి ఉగ్రవాదుల పనిబట్టారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడి సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరణించిన జైషే ఉగ్రవాదిని మజీద్ నాజిర్ గా గుర్తించారు. ఇటీవల ఫరూక్ మీర్ అనే పోలీసు అధికారిని చంపిన ఘటనకు అతడే బాధ్యుడని భావిస్తున్నారు. భారత భద్రతా బలగాలు ఇవాళ కశ్మీర్లో వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిపాయి. పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో ఈ టెర్రరిస్టులు హతమయ్యారు. గత మూడ్రోజులుగా నిత్యం కశ్మీర్ లోయలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ మూడు రోజుల్లోనే భారత జవాన్లు 11 మంది ఉగ్రవాదలను అంతమొందించారు.

Tags :