అమెరికాలో కామారెడ్డి జిల్లా వాసి మృతి

Updated:14/05/2018 02:52 AM

kamareddy resident venkaramireddy dies in america

అమెరికాలో కామారెడ్డి జిల్లా వాసి మృతి చెందాడు. మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి(40) డల్లాస్‌లో గ్లోబల్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి భార్య వాణి కూడా ఉద్యోగినే. అయితే తన స్నేహితులతో కలిసి వెంకట్రామిరెడ్డి బోటు షికారుకు వెళ్లాడు. దీంతో నీటిలో మునిగి పోయారు. మృతదేహాలను నది నుంచి బయటకు వెలికితీశారు డల్లాస్ పోలీసులు. వీరి మృతిపై డల్లాస్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి మృతితో ఆరెపల్లిలో విషాదం నెలకొంది. వారం రోజుల్లో వెంకట్రామిరెడ్డి మృతదేహం స్వగ్రామానికి రానుంది.