సీబీఐ కస్టడీకి వెళ్ళండి బరువు తగ్గుతారు:కార్తీ చిదంబరం

Updated:13/03/2018 05:30 AM

kaarthi chidhambaram told go to cbi custody for weight loss

ఎవరైనా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. డైట్‌ పాటించాల్సిన పనిలేదు. సీబీఐ కస్టడీలో ఉండండి.. సీబీఐ క్యాంటీన్‌ ఆహారం తినండి అని ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కార్తి చిదంబరం సలహా ఇచ్చారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదరంబరం కుమారుడైన కార్తి ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అతడిని సీబీఐ 12 రోజుల పాటు కస్టడీలో ఉంచింది. కస్టడీ అనంతరం మార్చి 24వరకు ఆయనకు కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో కార్తిని దిల్లీలోని తీహార్‌ జైలుకు పంపించారు.

సీబీఐ కస్టడీలో తాను బరువు చాలా తగ్గానని, చాలా తక్కువగా తినడం వల్లే ఇది సాధ్యమైందని, ఈ చిట్కా చాలా బావుందని చమత్కరించారు. తనకు కొత్త జత బట్టలు కావాలని, పాత బట్టలు బాగా వదులైపోయాయని చెప్పుకొచ్చారు. అందుకే ఎవరైనా బరువు తగ్గాలంటే సీబీఐకి ఫోన్‌ చెయ్యండి అంటూ కార్తి నవ్వుతూ చెప్పారని ఓ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. సీబీఐ అధికారులపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, పూర్తిగా ప్రొఫెషనల్‌గా డీల్‌ చేస్తున్నారని చెప్పారు. కార్తి తనకు ప్రత్యేక సెల్‌, ఇంటి భోజనం కావాలని కోర్టును కోరగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో కార్తి చిదంబరంను సీబీఐ ఫిబ్రవరి 28న అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణ జరుపుతోంది. మార్చి 15న ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

చిన్నచూపా?: టీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే భాస్కర్ రావు సంచలన కామెంట్స్

చిన్నచూపా?: టీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే భాస్కర్ రావు సంచలన కామెంట్స్

భాజపాకు నాగం గుడ్‌బై

భాజపాకు నాగం గుడ్‌బై

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పాలి

ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పాలి

మద్దతు ధరకు బోనస్‌ ఇవ్వరా?

మద్దతు ధరకు బోనస్‌ ఇవ్వరా?

కేటాయింపులు సరే...  ఖర్చులేవి?: లక్ష్మణ్‌

కేటాయింపులు సరే... ఖర్చులేవి?: లక్ష్మణ్‌

ఈడ చేయనోడు.. ఢిల్లీలో ఉద్ధ్దరిస్తాడా?

ఈడ చేయనోడు.. ఢిల్లీలో ఉద్ధ్దరిస్తాడా?

కేసీఆర్‌ కూటమికి పవార్‌ అడ్డు చక్రం!

కేసీఆర్‌ కూటమికి పవార్‌ అడ్డు చక్రం!

Latest Videos

You Tube Image

నటి భానుప్రియ ఇంట విషాదం | Heroine BhanuPriya Husband Passed Away | Adabhyderabad News