జాయింట్ వెంచర్ (జెవీ) ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వ ఉత్తర్వులు..

- యూనివర్శల్ రియల్టర్స్ యొక్క 5 ప్రాజెక్ట్‌లలోని వాణిజ్య,
నివాస, ఆతిథ్య ప్రోపర్టీల వినియోగదారులకు పెద్ద ఊరట..
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మే 07వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు భాగస్వామ్య కంపెనీలతో ఉన్న అన్ని జెవీ ప్రాజెక్ట్‌ల సమస్యలకూ పరిష్కారం లభించడంతో పాటుగా రిజిస్ట్రేషన్లు జరిగేందుకు మార్గాన్ని సుగమం చేసింది..
యుఆర్‌పీఎల్, హౌసింగ్ బోర్డులకు సంబంధించి ఇతర డెవలపర్లకు అనుకూలంగా 07 మే 2022 వ తేదీన జారీ చేసిన లేఖ ఎల్ఆర్ నెంబర్ 106/యాంబియన్స్/ఏఈ/పీసీ/2005 (లెటర్ నెంబర్. 106/ఆంబియెన్స్ / ఏఈ / పీసీ / 20005) లేఖతో మే2016లో జారీ చేసిన జీఓ నెంబర్ 1061అమలులోకి రావడంతో జూలై 2022 నుంచి బొటానికా, ప్లాటినా, రాడిసన్ హోటల్, మంజీరా ట్రినిటి సహా ఇతర గృహ, వాణిజ్య ఆస్తి యజమానులందరికీ జూలై 2022 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈ నిర్ణయం బొటానికాలో నివాసముంటున్న 300 కుటుంబాలకు పెద్ద ఊరట. తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం వీరంతా ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో వాణిజ్య ప్రాజెక్ట్‌లు అయినటువంటి ప్లాటినా, రాడిసన్,లీ మెరిడియన్ హోటల్ సహా పలు ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసిన రిటైల్ స్పేస్ యజమానులకు సైతం మహోన్నత సమాచారంగా నిలుస్తుంది. తమ వినియోగదారులకు యూనివర్శల్ రియల్టర్స్ పూర్తిగా మద్దతునందించడంతో పాటుగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసింది అని యూనివర్శిల్ రియల్టర్స్ డైరెక్టర్ ఎం పీ అగర్వాల్ అన్నారు. ‘‘తెలంగాణా హౌసింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్‌తో చర్చించిన మీదట యూనివర్శల్ రియల్టర్స్, తెలంగాణా హౌసింగ్ బోర్డ్ సహా అన్ని జెవీ భాగస్వాముల నడుమ ఉన్న వాణిజ్య మరియు సాంకేతిక సమస్యలకు సంబంధించిన అంశాలన్నీ పరిష్కరించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వినియోగదారులందరూ తమ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను జూలై2022 నుంచి సెటిల్మెంట్ నియమ నిబంధనలకు అనుగణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు’’ అని అన్నారు. గచ్చిబౌలిలో ఇదే ప్రాంతంలో త్వరలో రాబోతున్న యూనివర్శల్ రియల్టర్ ప్రాజెక్ట్‌లలో యాంబియన్స్ పార్క్ వ్యూ మరియు ఓ వాణిజ్య ప్రాజెక్ట్ సైతం ఉన్నాయి. వీటికి సైతం ఈ సెటిల్మెంట్లో భాగంగా అవరోధాలన్నీ తొలగిపోయాయి. ఈ అభివృద్ధిపై జెఎల్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం/హౌసింగ్ బోర్డు తీసుకున్న నిర్ణయం స్వాగతించతగినది. హౌసింగ్ బోర్డ్‌లో ప్రభావిత ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్ ఓసారి ప్రారంభమైతే, ఈ ప్రాజెక్ట్‌లలోని ఆస్తులకు చక్కటి విలువ వస్తుంది. అది ఎంతోమంది ప్రోపర్టీ యజమానులకు ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఈ ఆస్తుల ధరలన్నీ చాలా తక్కువగా ఉన్నాయి’’ అని అన్నారు. సుదీర్ఘకాలంగా ఎటూ తేల్చకుండా ఉన్న సమస్యలకు లభించిన ఈ పరిష్కారంతో , రియల్ ఎస్టేట్ గ్రూప్ ఇప్పుడు ఈ ప్రాంతంలో రాబోయే రెండేళ్లలో తమ ప్రాజెక్ట్‌లకు చక్కటి ధరలు లభిస్తాయని ఆశిస్తున్నారు. గతంతో పోలిస్తే మరింత వేగంగా అవి పెరగవచ్చని కూడా భావిస్తున్నారు. అంటే ప్రస్తుత మరియు సంభావ్య గృహ ,వాణిజ్య ప్రాంగణ యజమానులు రాబోయే సంవత్సరాలలో గణనీయంగా ఆర్ఓఐ పొందగలరు. కాన్సెప్ట్ యాంబియన్స్ ఛైర్మన్, యూనివర్శల్ రియల్టర్స్ డైరెక్టర్ ఎం పీ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘కాన్సెప్ట్ యాంబియన్స్ గ్రూప్ ప్రమోట్ చేస్తోన్న కంపెనీ యూనివర్శల్ రియల్టర్స్. ఇది బొటానికా, యాంబియన్స్ పార్క్ వ్యూ, ద ప్లాటినా, కమర్షియల్ కాంప్లెక్స్, లీ మెరిడియన్ హోటల్ వంటివి అభివృద్ధి చేసింది. ఇవన్నీ హౌసింగ్ బోర్డ్‌తో జెవీ ప్రాజెక్ట్లుగానే అభివృద్ధి చేసింది’’ అని అన్నారు. గతంలో విస్పర్ వ్యాలీ, పామ్ కంట్రీ వంటి ప్రాజెక్ట్‌లను కాన్సెప్ట్ యాంబియన్స్ అభివృద్ధి చేసింది. నైబర్‌హుడ్, ట్రైల్స్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లు. హౌసింగ్ బోర్డ్ జెవీ భాగస్వాములలో సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి, ఛైర్మన్ ధన్యవాదములు తెలిపారు. ‘‘ఈ రిజల్యూషన్‌తో, ఇప్పటికే అమ్ముడైన/పూర్తైన యూనిట్ల విక్రయాలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది ఆస్తుల కొనుగోలుదారులకు పూర్తి ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రోపర్టీల విలువ పరంగా గణనీయంగా వృద్ధి కూడా కనిపించనుంది. రిజిస్ట్రేషన్ జరగక పోవడం వల్ల వీటి ధరలు ఇప్పటికీ అతి తక్కువగా ఉన్నాయి’’ అని అన్నారు.