ప్రజలకు, ప్రభుత్వానికి మద్య వారధి జర్నలిస్ట్‌..

ప్రజలకు, ప్రభుత్వానికి మద్య వారధి జర్నలిస్ట్‌..


 జర్నలిస్ట్‌ పై దాడి దుర్మార్గం...
 బిఎస్‌పి పార్టీ వికారాబాద్‌ అసెంబ్లీ ఇన్చార్జి పెద్ది అంజన్న
వికారాబాద్‌ 15 జూన్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వికారాబాద్‌ జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో  సీనియర్‌ పాత్రికేయుడు పై అందరూ చూస్తుండగా దాడి చేయడం దుర్మార్గమని బి ఎస్‌ పి పార్టీ వికారాబాద్‌ అసెంబ్లీ ఇంచార్జ్‌ అంజన్న దాడిని తీవ్రంగా ఖండిరచారు. బుధవారం సోషల్‌ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ పాత్రికేయుడి ఇంటి స్థలంలో అక్రమంగా డబ్బా ఏర్పాటు చేయడమే గాక తిరిగి అతడి పైనే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వయసులోనే యువకులు క్రిమినల్‌ ఆలోచనలు చేస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు నిత్యం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉండి పనిచేసే జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు శిక్షలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎల్లవేళలా జర్నలిస్టులకు,ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు దాడికి పాల్పడిన వారిపై స్థానిక కోట పల్లి పోలీస్‌ స్టేషన్‌ లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :