ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి అంటున్నప్రభుత్వo

Updated:07/04/2018 12:43 PM

job selections should be done under the coverage of videos

ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంపిక ప్రక్రియలో స్వచ్ఛత కోసం ఈ కసరత్తు అవసరమని అభిప్రాయపడింది. మేఘాలయకు చెందిన ఒక కేసును విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయెల్‌, జస్టిస్‌ రోహింటన్‌ ఫాలి నారిమన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఎంపిక సంస్థలు.. ముఖ్యంగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్లు, రాష్ట్ర ఎంపిక బోర్డులు వీడియోలో చిత్రీకరించాలని ధర్మాసనం సూచించింది. పరీక్షా కేంద్రాలు, ఇంటర్వ్యూ కేంద్రాల్లో సాధ్యమయినంత మేర సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, ఈ ఫుటేజిని ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీ చూడవచ్చని, ఆ కమిటీ నివేదికను సంబంధిత వెబ్‌సైట్‌లో పెట్టవచ్చని పేర్కొంది. తన ఉత్తర్వు ప్రతిని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగానికి పంపాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.