ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం ఉద్యోగ మేళా

Updated:22/09/2017 12:00 AM

job mela on saterday

హైదరాబాద్‌కు చెందిన అపోలో హోం హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఈ నెల 23న  జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి అక్బర్ హబీబ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఎన్‌ఎం ఉద్యోగానికి జీఎన్‌‌ఎం కోర్సు పూర్తి చేసి అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాదాన్యం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 9515114408ను సంప్రదించాలని సూచించారు.