'ఎన్‌డి‌ఏ'లోకి జగన్‌ రాక?

Updated:13/03/2018 03:22 AM

jagan coming in nda??

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఓ జాతీయ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో జగన్‌కు కొన్ని గడ్డు ప్రశ్నలు ఎదురయ్యాయి. టీడీపీతో దూరమవుతున్న బీజేపీ పొత్తు కోసం మిమ్మల్ని సంప్రదించిందా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం తమను ఏ పార్టీ సంప్రదించలేదని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదని తనను పొత్తు కోరుతూ ఏ పార్టీ సంప్రదించలేదని జగన్ చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని ఆయన అన్నారు. తమ పార్టీ కేంద్రంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు గతంలో చెప్పిన విషయాన్నే జగన్ మరోసారి ఉటంకించారు.