ఏ సంబంధం లేని నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నిన్న సభలో జరిగిన ఘటన గవర్నర్ పరిధిలోనిదన్నారు. అలాగే సస్పెన్షన్లు రాజ్యాంగ వ్యతిరేక చర్య అని జానా నపేర్కొన్నారు. బడ్జెట్లో లోపాలను ఎత్తిచూపుతానే సభలో మేం లేకుండా చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. అలాగే అసెంబ్లీలో చర్చ లేకుండా... బడ్జెట్ను ఆమోదించాలనుకుంటున్నారని జానారెడ్డి పేర్కొన్నారు.