సీసీ నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు..!

Updated:27/01/2018 02:02 AM

intermediate practical exams start on 1st feb to 4th feb 2018

తెలంగాణ రాష్ట్రం లో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించుటకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడును. ఈసారి జంబ్లింగ్ విధానం తొలగించగా, ప్రతి కేంద్రానికి పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం. సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీసీ నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రాక్టికల్ పరీక్షలు పలు కళాశాలల్లో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీనికి చెక్ పెట్టేందుకు ప్రశ్నాపత్రాలు తీసుకోవడం, విద్యార్థుల మార్కులను పంపించడం వరకు ఆన్ లైన్ లోనే జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాలను పరీక్షకు కొద్ది గంటల ముందే డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు పరీక్ష ముగియగానే మార్కులను ఆప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు వోకేషనల్ కోర్సు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ రోజు నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు:

ఇంటర్మీడీయట్ విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు ఈనెల 27, 29వ తేదీలలో ఇంటర్ మొదటి సంవత్సరం వారికి నైతికత-మానవీయమైన విలువలు, పర్యావరణ విద్య అనే రెండు సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రకృతిపై అవగాహన కోసం ఈ సబ్జెక్టులను చేర్చడం జరిగిందని ఇంటర్మీడియట్ విద్యా అధికారులు తెలుపుతున్నారు.

ఈ సబ్జెక్టులకు మొత్తం 60 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో తప్పకుండా పాస్ అవ్వాలి. ఈ పరీక్షకు హాజరు కాకపోతే ఫెయిల్ అయినట్లే లెక్క. అందుకే మొదటి సంవత్సరం విద్యార్థులు విథిగా ఈ పరీక్షకు హాజరు కావాలి. హాజరైతే సరిపోదు ఆ సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులు రావాలి.