మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

Updated:15/04/2018 09:47 AM

intermediate advance supplementary from may 14th

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యాశాఖాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో సబ్జెక్టులు కొల్పోయిన విద్యార్థులు బోర్డు నిర్ణయించిన ఫీజును ఏఫ్రిల్ 20వ తేదీ వరకు చెల్లించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ముందస్తుగానే ఫీజు చెల్లించి పరీక్షకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. అదనపు రుసుంతో పరీక్ష ఫీజుకు చెల్లింపునకు సమయం ఇవ్వకపోవడం గమనర్హం. సబ్జెక్టుల వారీగా మార్కులు పెంచుకునేందుకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షల్లో సబ్జెక్టు వారిగా మార్కులు తగ్గినప్పటికి, గతంలో ఆ సబ్జెక్టులో ఎన్ని మార్కులున్నాయో అవే మార్కులు లెక్కలోకి వస్తాయని అధికారులు వివరిస్తున్నారు. ఎటువంటి అనుమానాలున్న తమ తమ కళాశాలల్లోని అధ్యాపకులను వివరాలను అడిగి తెలుసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు.