ఇంటర్ పరీక్ష పేపర్ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ విధానం వద్దు...

ఇంటర్ పరీక్ష పేపర్ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ విధానం వద్దు...


- పాత పద్ధతిలో కొనసాగించాలని డిమాండ్ చేసిన పీ.డీ.ఎస్.యూ.  రాష్ట్ర కార్యవర్గం..

హైదరాబాద్, 31 జనవరి ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్ విద్యార్థులు పరీక్ష పేపర్లను ఆన్లైన్ వాల్యుయేషన్ చేయాలని మంత్రి ఆదేశం మేరకు అని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్  నిర్ణయం చేయడం సరి అయింది కాదు..  పరీక్ష పేపర్లు దిద్దే విద్యా విధానం డైరెక్ట్ గా ఒక అధ్యాపకుడు తన చేతితో  క్షుణ్ణంగా పరిశీలించి వ్యాల్యుయేషన్  చేసి మార్కులు వేసే విధానం సరి అయినది..  కానీ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ పేరుతో ఆన్ స్క్రీన్ మీద ఎవరు కరెక్షన్ చేస్తారో తెలువదు..  దీంతో 35 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది..  పనిభారం తప్పించుకునే పేరుతో ఆర్థిక భారాన్ని విద్యార్థులపై మోపే ఈ విధానం సరికాదు.. విద్యార్థుల గోప్యతకు సంబంధించిన అన్ని వివరాలు ఏజెన్సీకి అప్పజెప్పటం  తప్పు.. ఇలా చాలా తప్పు తడకగా కొనసాగే ఆన్లైన్ పేపర్ కరెక్షన్ ను వెంటనే నిలిపివేసి విద్యార్థుల భవిష్యత్తు ఆదుకోవాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గం  ప్రభుత్వాన్నీ  డిమాండ్ చేస్తోంది.. కరోన పరిస్థితుల్లో అనివార్య కారణాలవల్ల కొన్ని యూనివర్సిటీలో ఈ విధానం కొనసాగుతోంది.. ఒక పేపర్ వాల్యుయేషన్, స్క్రూటినింగ్, గ్రేడింగ్ కు సుమారు 30 రూపాలు, పాత పద్దతిలో ఖర్చు చేస్తే, నేడు ఆన్ లైన్  పేపర్ వాలు యేషన్ పేరుతో 60 రూ, ఖర్చు.. కొన్ని యూనివర్సిటీలో అవుతుంది.. ఈ భారం మొత్తం విద్యార్థులపై రుద్ది బలవంతంగా పరీక్ష ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నారు..   ఈ విధానంతో విద్యార్థులపై ఫీజు భారం తప్ప మరొకటి ఉండదు.. 

సుమారు 35 లక్షల మంది భవిష్యత్  ని తమకు నచ్చిన ఏజెన్సీకి ఇవ్వాలనుకోవడం సరికాదు.. గతంలో అనుభవంలేని గ్లోబరినాకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే, అనేక తప్పులు జరిగి చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అయింది..  ఇప్పుడు గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని పలువురితో సంప్రదింపులు జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేస్తోంది.. లేని యెడల పెద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పీ.డీ.ఎస్.యూ.  రాష్ట్ర అధ్యక్షులు, మామిడి కాయల పరశురాం.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇడం పాక విజయ్ ఖన్నా.. హెచ్చరించారు..

Tags :