నిమిషాల్లో 15 వేల కోట్లు నష్టపోయిన ఇన్ఫోసిస్

Updated:16/04/2018 01:08 AM

infosys lost rs 15000 crores within minutes

ప్రముఖ ఐటీ కంపెనీన్ఫోసిస్ షేర్లు ఇవాళ భారీగా పతనమయ్యాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా ఆరు శాతం పతనమవడంతో ఆ సంస్థ నిమిషాల వ్యవధిలో రూ.15 వేల కోట్లు నష్టపోయింది. శుక్రవారం రూ.1169 దగ్గర ముగిసిన ఇన్ఫోసిస్ షేరు ధర.. సోమవారం రూ.1099కి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. గత శుక్రవారం తమ నాలుగో త్రైమాసికం ఫలితాలను ఈ సంస్థ విడుదల చేసింది. అంచనాలకు తగినట్లే ఫలితాలు వచ్చాయి. అయితే 2019 ఆర్థిక సంవత్సరంలో కొందరు విశ్లేషకుల వృద్ధి రేటు అంచనాలను సంస్థ అందుకోలేకపోయింది. అటు సంస్థ ఆపరేటింగ్ మార్జిన్ అంచనాలు కూడా విశ్లేషకులను అసంతృప్తికి గురిచేశాయి. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ రూ.3690 కోట్ల నికర లాభాన్ని చూపించింది.