జయహో భారత మహిళ..

జయహో భారత మహిళ..


( అరుదైన ఘనత సాధించిన భారత నారి.. )
- ఐక్యరాజ్య సమితిలో తొలి మహిళా రాయబారి.. 
- బాధ్యతలు స్వీకరించిన రుచిరా కాంబోజ్.. 
- 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి.. 
- సివిల్ సర్వీస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్.. 
- అనేక‌ దేశాల్లో సేవలందించిన చరిత్ర రుచిరా సొంతం.. 

న్యూ ఢిల్లీ, 03 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :

స్త్రీ అన్న పదం ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ.. కానీ ఆ అక్షరంలో వేనవేల భావాలు.. మేధస్సు, తెగింపు, ప్రేమ దాగివుంటాయని గ్రహించాలి.. జాతి సృష్టికి స్థానం కల్పించే అపురూపం స్త్రీ.. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని శాసించగల అద్వితీయ శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే సొంతం.. కాగా భారతీయ స్త్రీ కి ప్రపంచంలో ఒక గొప్ప స్థానం ఉంది.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో తొలి మహిళా రాయబారిగా భారతనారి రుచిరా కాంబోజ్ చరిత్రను సృష్టించారు.. (ఇంట్రో )
 
ఐక్యరాజ్య సమితిలో భారతదేశ రాయబారిగా రుచిరా కాంబోజ్ బాధ్యతలు స్వీకరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. యూ. ఎన్.  సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు తన ఆధారాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. "భద్రతా మండలిలోని నా అంబాసిడర్ స్నేహితులందరినీ ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త హోదాలో నా దేశానికి సేవ చేయడం నా గొప్ప గౌరవం". అని రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. అంతేకాదు బాధ్యతలను స్వీకరిస్తోన్న ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేశారు. ఇక రుచిరా కాంబోజ్‌కు ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న టీఎస్ తిరుమూర్తు అభినందనలు తెలియజేశారు.


మన దేశం నుంచి ఈ రికార్డును సాధించిన మొదటి మహిళ రుచిరా కాంబోజ్ కావడం మరో విశేషం. రుచిరా కాంబోజ్ (58) 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. గతంలో భూటాన్‌‌లో భారత రాయబారిగా ఉన్నారు. జూన్‌లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. రుచిరా 2002-2005 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గా కూడా పనిచేశారు.

Tags :