భారత మహిళకు అరుదైన గౌరవం..

భారత మహిళకు అరుదైన గౌరవం..


( పాకిస్తాన్ పోలీస్ శాఖలో భారత మహిళకు కీలక బాధ్యతలు.. )
- తొలి హిందూ మహిళగా హిస్టరీ క్రియేట్ చేసిన మనీషా రోపేటా.. 
- లియారీ డీ.ఎస్.పీ. గా బాధ్యతలు స్వీకరించిన వైనం.. 
- హర్షం వ్యక్తం చేస్తున్న భారత మహిళా లోకం.. 
- ఇండియన్స్ కు ప్రపంచంలో ప్రాధాన్యం ఉంటుంది.. 

పాకిస్తాన్, 29 జూలై :
పాకిస్తాన్‌లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హిందువులను శత్రువులుగా భావించే ఆ దేశంలోనూ.. ప్రాధాన్యత ఉంటుందని ఈ ఘటన రుజువు చేసింది. 26ఏళ్ల మనీషా రొపేటా పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టిన.. తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. హిస్టరీ క్రియేట్‌ చేసిన రొపేటా.. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో నిలిచారు.  ప్రస్తుతం.. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.

సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్‌ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మనీషా... తన 13వ ఏటనే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత ఆమె తల్లే ఎంతో కష్టపడి పెంచింది. చిన్నతనం నుంచి తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు మనీషా తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని,   అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు డీఎస్పీగా బాధత్యలు స్వీకరించిన తర్వాత మనీషా రోపేటా చెప్పారు. పాకిస్తాన్‌లో అమ్మాయిలకు ఎక్కువగా.. డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయన్న ఆమె...  పోలీసు శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు స్పష్టం చేశారు.

Tags :