రాష్ట్రపతి ముర్ముతో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు..

- సతీసమేతంగా రాష్ట్రపతి భవన్ కు..
- ద్రౌపది ముర్ముకు అభినందనలు అందజేత..
- ముర్ముకు పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రుల అభినందనలు..
న్యూ ఢిల్లీ, 01 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
భారత రాష్ట్రపతిగా ఇటీవలే పదవీ ప్రమాణం చేసిన ద్రౌపది ముర్మును సోమవారం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులు కలిశారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ సతీ సమేతంగా సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును తన అర్ధాంగితో కలిసి ఆయన అభినందించారు. ఈ ఫొటోలను రాష్ట్రపతి భవన్ వర్గాలు సోషల్ మీడియాలో విడుదల చేశాయి. ఇదిలా ఉంటే... పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు కూడా సోమవారం ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపారు.