ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్..

ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్..


- ప్రస్తుతం భూటాన్ లో భారత రాయబారిగా విధులు.. 
- 1987 లో సివిల్ సర్వీసెస్ లో కౌన్సిలర్ గా నియామకం.. 
- పలు కీలక పదవుల్లో సేవలందించి రుచిరా.. 
- ఇక ఐక్యరాజ్య సమితిలో భారత్ గళం వినిపించనున్న వైనం.. 
 
న్యూఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీఎస్‌ తిరుమూర్తి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రుచిరాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 1987 బ్యాచ్‌  ఇండియన్ ఫారిన్ సర్వీస్ ( ఐఎఫ్‌ఎస్‌) అధికారి అయిన రుచిరా.. ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భూటాన్ కు భారత మొదటి మహిళా రాయబారిగా రుచిరా నిలిచారు. 

రుచిరా కాంబోజ్ 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్ లో ఆల్ ఇండియా మహిళా టాపర్. 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్ లో కూడా టాపర్. 2002, 2005 వరకూ న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత మిషన్ లో కౌన్సెలర్ గా నియమితులయ్యారు. అక్కడ ఐరాస శాంతి పరిరక్షణ, యూఎన్ భద్రతా మండలి సంస్కరణ, మధ్యప్రాచ్య సంక్షోభం వంటి అంశాలపై పని చేశారు. ఆ తర్వాత పలు కీలక పదవుల్లో సేవలందించిన రుచిరా కాంబోజ్... ఇకపై ఐక్యరాజ్య సమితిలో భారత్ గళాన్ని వినిపించనున్నారు.

Tags :