ఐజని కిట్ల పంపిణీ..

ఐజని కిట్ల పంపిణీ..


( సీజనల్ వ్యాధులనుండి మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమం.. )
హైదరాబాద్, 03 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
బుధవారం రోజు మల్లెపల్లి ఐటిఐలో మహిళా ఉద్యోగులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ద్వారా ఐజని కిట్ పంపిణీ చేయడం జరిగింది..  ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది..  ఈ సీజన్ లో  వచ్చే వ్యాధుల నుండి మహిళలకు భద్రత కల్పించాలని ముఖ్య ఉద్దేశ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పుప్పాల జ్యోతిరాణి, మానబోయిన కృష్ణ యాదవ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, గడ్డం జ్ఞానేశ్వర్, ప్రవీణ్ కుమార్ గని, ఖలీల్ పాషా, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు..

Tags :