పసిమొగ్గ ప్రాణాలు తీసిన భారీ వర్షం..

పసిమొగ్గ ప్రాణాలు తీసిన భారీ వర్షం..


( జగిత్యాల జిల్లా, రాయికల్ పట్టణంలో దారుణం.. )

హైదరాబాద్, 03 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎన్నో ప్రాణాలు నీట కలిసిపోయాయి.. రైతుల జీవితాలు కన్నీటితో తడిచిపోయాయి.. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఒక దారుణం చోటుచేసుకుంది.. పట్టణంలో కురిసిన భారీ వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి.. తన ఇంటిముందు ఆడుకుంటూ అప్సర్ అనే 2 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు.. బాలుడి మృతిలో విషాదం చోటుచేసుకుంది.. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

Tags :