టూత్ బ్రష్ తో గుండె జబ్బును గుర్తించ‌వ‌చ్చు..!

Updated:04/01/2018 06:31 AM

heart disease with a toothbrush can be find

టూత్ బ్రష్ అంటే మీకు తెలుసా? ఆ టూత్ బ్రష్ తో ఏం చేస్తారో తెలుసు కదా..! అయితే టూత్ బ్రష్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ టూత్ బ్రష్ మనకు వస్తున్నా అతి డేంజరస్ జబ్బును గుర్తిస్తుంది. టూత్ బ్రష్ ఏంటి? జబ్బును గుర్తించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే విషయం లోకి వెళ్దాం...

టూత్ బ్రష్ లు దంతాల్ని శుభ్రం చేయడమే కాదు. గుండె జబ్బుల్ని గుర్తిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలా మిరిమిట్లు గొలిపే ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరిగించేస్తాయి. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం.

అందుకు ప్రతి రోజూ రెండు మూడు సార్లు బ్రెష్ చేయడం వల్ల మనకు కావాల్సినట్లుగా దంతాలు తయారవుతాయి. ఈ బ్రష్ లు దంతాల శుభ్రం కోసమే కాకుండా గుండె జబ్బుల్ని గుర్తించేలా స్పెయిన్ కు చెందిన డాక్టర్ల బృందం పరిశోదనలు చేస్తుంది. సాధారణంగా మానవ శరీంలో ఉన్న లాలాజలంలో సోడియం సమస్యలు తలెత్తుతాయి. దీంతో హృదయ స్పందన రేటు, వ్యాధి నిరోదకశక్తి తగ్గుతుంది.

ఈ సమస్యల నుంచి కాపాడుకోవాలంటే టూత్ బ్రష్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ బ్రష్ కు సంబంధించిన పరిశోదనలు జరుగుతున్నాయి. ఈ పరిశోదనల్లో ఫలితాలు సాధిస్తే టూత్ బ్రష్ తో డాక్టర్ల అసరం లేకుండా గుండె సంబంధిత వ్యాధుల్ని గుర్తించవచ్చు.