గుండె జబ్బులకు ప్రపంచస్థాయి చికిత్సలు

గుండె జబ్బులకు ప్రపంచస్థాయి చికిత్సలు


- నల్గొండ జిల్లాకు చెందిన 80 ఏళ్ల  వృద్ధ వ్యక్తి యాదగిరిరెడ్డిని తీవ్ర గుండె జబ్బు 
   ముప్పునుండి కాపాడి కొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్ వైద్యులు 

హైదరాబాద్, 04 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యశోద హాస్పిటల్స్ హైదరాబాద్, ఇప్పుడు గత కొంతకాలంగా గుండె బృహద్ధమని కవాటం యొక్క తీవ్రమైన స్టెనోసిస్‌తో బాధపడుతున్న, నల్గొండకు చెందిన 80 ఏళ్ల  వృద్ధ వ్యక్తి యాదగిరిరెడ్డికి  ట్రాన్స్‌కాథెటర్ బృహద్ధమని కవాటం ఇంప్లాంటేషన్ చేసి కొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్ మలక్‌పేట్ వైద్యులు.

ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్-మలక్‌పేట్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్.సీతారాం, మాట్లాడుతూ.. నల్గొండకు  చెందిన 80 ఏళ్ల యాదగిరిరెడ్డి, తరచు కళ్లు తిరగడం, ఊపిరి ఆడకపోవడం వంటి  సమస్యలతో బాధపడుతుండేవాడు. గత కొన్ని నెలలుగా ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది. సమస్య తీవ్రమవడంతో యాదగిరిరెడ్డి, గతనెల యశోద హాస్పిటల్ మలక్‌పేట్లో చేరడం జరిగింది. మా దగ్గరకు వచ్చిన యాదగిరిరెడ్డిని  అత్యాధునిక ‘క్యాథ్ ల్యాబ్’ కు తరలించి మరిన్ని పరీక్షలు చేసిన తరువాత వారు బృహద్ధమని కవాటం యొక్క తీవ్రమైన స్టెనోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. యాదగిరిరెడ్డి, అతని వయస్సు కారణంగా శస్త్రచికిత్సకు చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుందని, దీనికి అత్యాధునిక పద్దతిలో చేసే ట్రాన్స్‌కాథెటర్ బృహద్ధమని వాల్వ్ ఇంప్లాంటేషన్, దీనికి సరైన పరిష్కారం అని వారి కుటుంబసబ్యులకు వివరించి, వారి ఆమోదంతో విజయవంతంగా బృహద్ధమని వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయడం జరిగింది. ట్రాన్స్‌కాథెటర్ బృహద్ధమని వాల్వ్ ఇంప్లాంటేషన్. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ విధానం ద్యారా శస్త్ర చికిత్సకు బదులుగా ‘వాల్వ్’ (కవాటం) మరమ్మత్తు చేసి కవాటం తొలగించకుండా రిపేర్ లేదా రిప్లేస్ చేయడం. ఇది చాలా సురక్షితమైనది, చాలా ప్రభావంతమైన వైద్య చికిత్స విధానం. పాత దెబ్బతిన్న వాల్వ్ తొలగించకుండా చేసే ఈ చికిత్స ప్రక్రియ శస్త్ర చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం, శ్రేయస్కరం.  ఈ విధానంలో కొత్త వాల్వ్ భర్తీ చేసిన తరువాత వాల్వ్ కణజాలాన్ని మరియు రక్త ప్రసరణను నియంత్రించడం జరుగుతుంది తద్వారా పేషెంట్ ఆరోగ్య స్థితిని మెరుగు పర్చుతు పూర్తిగా కోలుకోవడానికి మందుల సహకారంతో చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ‘ఇంటర్వెన్షనల్’ వైద్య విధానంలో అతి చిన్న కోతలు ఉంటాయి ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్సలోలాగా ఛాతీ కోత ద్వారా వేరు చేయనవసరం లేదు. ఒక రకంగా ఇది ‘స్టెంట్’ వేయించుకోవడం లాంటిదే సులభతరం సురక్షితం. ఇది ఒక బెలూన్ చికిత్స లేదా రికవరీ పరంగా ఒక యంజియోప్లాస్టితో పోల్చవచ్చు. ఆసుపత్రిలో ఉండే సమయం కేవలం 3 నుండి 5 రోజులు మాత్రమే. చాలా సందర్బాలలో వేగవంతమైన రికవరీకి అవకాశాలు సన్నగిల్లినప్పుడు, రిస్క్ ఎక్కువగా ఉన్నపుడు టి.ఏ.వీ.ఆర్. లేదా టి.ఏ.వీ.ఐ. ఒక మంచి ఎంపిక. ఈ రెండు విధానాల్లో ఒకదాన్ని రోగి పరిస్టితిని బట్టి ఉపయోగించి నిర్వహిస్తారు. ఎంతో మంది క్రిటికల్ పేషెంట్లు డెబ్బై ఏళ్ళు వయసు దాటిన తర్వాత కూడా టి.ఏ.వీ.ఆర్. లేదా టి.ఏ.వీ.ఐ.  తో కొత్త జీవితం పొందారు కవాటాల భర్తీకి, వల్వ్స్ చికిత్స లో వీటిని అత్యుత్తమమైన, భద్రమైన చికిత్సలుగా చెప్పవచ్చు. ఈ విధానంలో తొడ ధమని ద్యారా కేథటర్ ప్రవేశ పెట్టడం ద్యారా ఛాతీలో చిన్న కోతతో లేదా ఛాతీ లో పెద్ద ధమని ద్యారా ఎడమ కాలి తొడ యొక్క కొన ద్యారా గుండె వరకూ అయోర్టాకు కేథటర్ ప్రవేశపెట్టడం ద్యారా అతి తక్కువ కోతతో చేసే మినిమల్లీ ఇన్వేసివ్ వైద్య చికిత్స ప్రక్రియ ఈ టి.ఏ.వీ.ఐ.  అని, యశోద హాస్పిటల్స్ లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో యాదగిరిరెడ్డి చాలా తక్కువ సమయంలో అద్భుతమైన రికవరీ సాదించి కేవలం రెండు  రోజులలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగలిగామని, ఇప్పుడు యాదగిరిరెడ్డి పూర్తి ఆరోగ్యంగా తన పనులు తాము చేసుకోగల్గుతున్నారు. అని యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇనర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్.సీతారాం, తెలిపారు.

Tags :