అధికధరలు వసూలు చేసిన హరిణి గ్యాస్ ఏజెన్సిస్ లైసెన్ రద్దు చెయ్యాలి..

అధికధరలు వసూలు చేసిన హరిణి గ్యాస్ ఏజెన్సిస్ లైసెన్ రద్దు చెయ్యాలి..


- డిమాండ్ చేసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి.. 

హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
 సిద్దిపేట జిల్లా, నంగునూరు మండల కేంద్రంలో అధికధరలు వసూలు  చేసిన  హరిణి గ్యాస్ ఏజెన్సిస్ లైసెన్ రద్దు చెయ్యాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి గారు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్ గారికి పిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు .గత పదకొండు సంవత్సరాలుగా గ్యాస్ వినియోగదారుల దగ్గర ముపై రూపాయలనుండి యాభై రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరల వసూలు  విషయం మీద సంబంధిత అధికారులు నిన్న చేసిన విచారణలో నిజమని తేలిందికనుక ఇట్టి గ్యాస్ ఏజెన్సిస్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు చెయ్యాలని, అదేవిధంగా గత పదకొండు సంవత్సరాలుగా ఒక్క సంవత్సరానికి సుమారు 80 లక్షల రూయాలు వసూలు చేసిన వీరి ఉపేక్షించొద్దని,  అధిక ధరల తాలూకా డబ్బులను తిరిగి వినియోగ దారులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెరాస పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వినియోగదారులవద్ద ముక్కుపిండి  అధిక ధరలు వసూలు చేసిన వీరిని ప్రభుత్వం వెనకనుండి కాపాడాలని చూస్తుందని ఆరోపించారు. వ్యాపారం ముసుగులో కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేసిన వారిపైన తగిన చెర్యలు తీసుకోకుంటే ఎన్ఫోర్స్ మెంట్ శాఖకు పిర్యదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షుడు తప్పెట శంకర్, 
యస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రాగుల కనకయ్య, చెలికాని యాదగిరి, అనరాజు నాగరాజు, తిప్పని రాజేశ్వర్, పుల్లూరి రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :