Friday, March 29, 2024

స్కేవేస్, ఫ్లైవోవర్లకు గ్రీన్ సిగ్నల్..

తప్పక చదవండి
  • 33 ఎకరాలు ఇచ్చేందుకు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం
  • మేడ్చల్, తిరుమలగిరి మార్గాల్లో స్కైవేలకు అనుమతి
  • డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ల నిర్మాణానికి మార్గం సులువు
  • హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలవాసులకు ఊరట..
    హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో స్కేవేస్, ఫ్లైవోవర్ల నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో స్కేవేస్, ఫ్లైవోవర్ల నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించింది. 33 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మార్గాల్లో రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. ‘డబుల్‌ డెక్కర్‌ మెట్రో’ స్కైవేల నిర్మాణానికి మార్గం సుగమమైంది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలవాసులతో పాటు హైదరాబాద్ – సిద్దిపేట – కరీంనగర్ – మంచిర్యాల, హైదరాబాద్ – మేడ్చల్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – నాగ్‌పూర్ మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి గొప్ప ఊరట లభిస్తుంది.. జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి, మేడ్చల్ మార్గాల్లో వాహనాల రద్దీ బాగా పెరిగింది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఈ రహదారులను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ప్రధానంగా ఈ మార్గంలో కంటోన్మెంట్ ఏరియా పరిధిలో కేంద్ర రక్షణ శాఖ భూములు ఉన్నాయి. ఈ భూములకు బదులుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సరిపడా భూములు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా చెబుతోంది.
    కేటీఆర్ సహా తెలంగాణ మంత్రుల బృందం ఈ విషమమై పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్య గురించి మరోసారి ప్రస్తావించారు. ఎట్టకేలకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అంగీకరించింది. ఎన్‌హెచ్‌ 44 ప్యారడైజ్ – సుచిత్ర, ఎస్‌హెచ్‌ 1 జింఖానా గ్రౌండ్ – హకీంపేట్ వరకు రోడ్డు విస్తరణకు 33 ఎకరాల భూమిని ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించినట్లు బోర్డు సీఈవో మధుకర్ నాయక్ గురువారం వెల్లడించారు. ఆర్మీ, ప్రైవేట్, బీ2 కలిపి మొత్తం 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చూస్తాయని ఆయన తెలిపారు. ఈ మార్గంలో స్కైవేలు, మెట్రో కారిడార్‌, రహదారుల విస్తరణ కోసం మొత్తం 157 ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కోరుతోంది. తమ పరిధిలోని 33 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తెలిపారు. 33 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 329 కోట్లను ఇస్తే కంటోన్మెంట్ పరిధిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు