భారీ అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ

Updated:13/03/2018 01:26 AM

govt financial dull to air india

భారీ అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కేంద్ర ప్రభుత్వం వందల కోట్లలో బకాయిలు పడినట్లు వెలుగులోకి వచ్చింది. వివిఐపి ఛార్టెడ్‌ విమానాలకుగానూ కేంద్రం రూ.325కోట్లకు పైనే ఎయిరిండియాకు చెల్లించాలట. ఈ మేరకు సమాచారహక్కు చట్టం ద్వారా ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. ఎయిరిండియాకు రావాల్సిన మొత్తంపై వివరాలుతెలియజేయాలంటూ సమాచారహక్కుచట్టం ద్వారా దరఖాస్తు నమోదైంది. దీంతో సంబంధిత అధికారులు ఈ వివరాలను దరఖాస్తుదారుడికిచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. దీని ప్రకారం, పలు మంత్రిత్వశాఖల నుంచి వందల కోట్ల రూపాయలు ఎయిరిండియాకు రావాలి. జనవరి 31, 2018నాటికి విమానయాన సంస్థకు రూ.325.81కోట్ల పెండింగ్‌ బిల్లులున్నాయి. ఇందులో రూ.84.01కోట్లు గతేడాది ప్రయాణాలకు సంబంధించిన బిల్లులు కాగా, మిగతా మొత్తం ఈ ఏడాదికి చెందినవే. ఇవన్నీ వివిఐపి ఛార్టెట్‌ విమానాలకు సంబంధించినవి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులు విదేశాలకు వెళ్లినపుడు ఎయిరిండియా ఈ చార్టెడ్‌ విమానాలను అందచేస్తుంది. ఇందుకోసం రక్షణశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్‌ సెక్రటేరియట్‌ ఖజానాల నుంచి ఎయిరిండియాకు చెల్లిస్తారు. గతేడాది వివిఐపి ప్రయాణాలకు సంబంధించి కేంద్రం ఎయిరిండియాకు ఇంకా రూ.451.71కోట్లు బకాయిలు చెల్లించాల్సిఉంది. కాగా, ఈ ఏడాది జనవరి 31నాటికి మరో రూ.553.01కోట్లు ఖర్చయ్యాయి. దీంతో మొత్తం రూ.1004.71కోట్ల మేర కేంద్రం విమానయాన సంస్థకు బకాయి పడింది. ఇందులో రూ.678.91కోట్లు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించగా, ఇంకా రూ.325.81కోట్లు కట్టాల్సి ఉంది. ఇందులో ఎక్కువగా రూ.178.55కోట్లు విదేశాంగ శాఖ చెల్లించాల్సినవే