హెచ్‌1బీ దరఖాస్తులొచ్చాయ్‌ సరిపడా

Updated:07/04/2018 06:24 AM

got h1b visa as needed

హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తులు భారీగానే వచ్చినట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. ఏటా 65వేల హెచ్‌1బీ వీసాలను మంజూరు చేస్తారు. ఈ ఏడాది యూఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసేంత హెచ్‌1బీ వీసాల కంటే ఎక్కువగానే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి మంజూరు చేసే 20వేల వీసా క్యాప్‌కు సంబంధించి సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ‘హెచ్‌1బీ వీసాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని చెప్పలేం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతి అనుసరించే వీసాలు జారీ చేస్తాం’ అని యూఎస్‌సీఐఎస్‌ ప్రతినిధి తెలిపారు.
సెలెక్ట్‌ కాని దరఖాస్తుదారులు చెల్లించిన రుసుమును తిరిగి ఇచ్చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఎప్పుడు లాటరీ పద్ధతి నిర్వహిస్తారు, దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈనెల 2 నుంచి హెచ్‌1 వీసాల దరఖాస్తుల ప్రకియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దరఖాస్తుల్లో అన్ని విభాగాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని, వాటిని సునిశితంగా పరిశీలిస్తామని, చిన్న చిన్న తప్పులను ఉపేక్షించబోమని యూఎస్‌సీఐఎస్‌ ఇటీవలే హెచ్చరించింది. ప్రత్యేక వృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ సిబ్బందిని అమెరికా కంపెనీలు నియమించుకోవడానికి ఈ హెచ్‌1బీ వీసా వీలు కల్పిస్తుంది. భారత్‌, చైనా వంటి దేశాలకు చెందిన వేల మంది ఉద్యోగులు ఈ వీసాల మీద ఆధారపడి అమెరికాలో పనిచేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

చదువేనా ! ఇప్పుడూ

చదువేనా ! ఇప్పుడూ

తక్షణ విడుదల వద్దు అక్రమ వలసదారులకు

తక్షణ విడుదల వద్దు అక్రమ వలసదారులకు

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి  అంటున్నప్రభుత్వo

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి అంటున్నప్రభుత్వo

పీజీ మెడికల్‌కు 2,596 దరఖాస్తులు

పీజీ మెడికల్‌కు 2,596 దరఖాస్తులు

“ఎస్సీ” విద్యార్ధుల “విదేశీ విద్య” కి స్కాలర్‌షిప్‌లు..

“ఎస్సీ” విద్యార్ధుల “విదేశీ విద్య” కి స్కాలర్‌షిప్‌లు..

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR