గూగుల్ ప్లే మ్యూజిక్ స్థానంలో యూట్యూబ్ రీమిక్స్

Updated:26/04/2018 01:09 AM

google said to replace play music with youtube remix

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ప్లే మ్యూజిక్ యాప్ స్థానంలో యూట్యూబ్ రీమిక్స్ పేరిట ఓ నూతన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీంతో ప్లే మ్యూజిక్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ వరకు ప్లే మ్యూజిక్‌ను వాడుతున్న యూజర్లు యూట్యూబ్ రీమిక్స్‌కు అకౌంట్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్లే మ్యూజిక్‌లో ఉండే ఫేవరెట్ సాంగ్స్, ప్లే లిస్ట్స్, ఆల్బమ్స్ అన్నీ యూట్యూబ్ రీమిక్స్‌లోకి వచ్చేస్తాయి.

యూట్యూబ్ రీమిక్స్ సేవలను ప్రారంభించే విషయం మాట ఎలా ఉన్నప్పటికీ ఆ యాప్ సేవలను ఎప్పుడు ప్రారంభించేది గూగుల్ వెల్లడించలేదు. కానీ ఈ యాప్‌ను ఇప్పటికే అంతర్గతంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. కనుక త్వరలోనే యూట్యూబ్ రీమిక్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది. అది లాంచ్ అయితే ఇక అప్పుడు ప్లే మ్యూజిక్‌ను వాడే యూజర్లందరూ యూట్యూబ్ రీమిక్స్‌కు మారాల్సి ఉంటుంది.

 

సంబంధిత వార్తలు

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR