గూగుల్ డ్రైవ్ యూజర్లకు గుడ్ న్యూస్.

Updated:15/05/2018 04:20 AM

good news for google drive users

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ డ్రైవ్ పెయిడ్ సర్వీస్‌ను వాడుకునే కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. ఇకపై గూగుల్ డ్రైవ్ సేవలను గూగుల్ వన్ బ్రాండ్ కిందకు తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు తక్కువ ధరలకే అధిక డ్రైవ్ స్టోరేజ్ అందించేలా నూతన ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది. 100 జీబీ నుంచి 30 టీబీ వరకు వివిధ రకాల టారిఫ్‌లలో గూగుల్ డ్రైవ్ ప్లాన్లు ఉంటాయని గూగుల్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతోపాటు ఈ డ్రైవ్ ప్లాన్లను ఎంచుకునే కస్టమర్లకు ఇతర గూగుల్ పెయిడ్ సేవలను ఉచితంగా అందిస్తామని చెప్పారు. అయితే గూగుల్ వన్ బ్రాండ్ సేవలు ముందుగా యూఎస్‌లో యూజర్లకు అందుబాటులోకి వస్తాయని, తరువాత ప్రపంచంలో ఇతర దేశాల యూజర్లకు లభిస్తాయని తెలిపారు.