గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..

గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..


( సంచలన ప్రకటన చేసిన డబ్ల్యు.హెచ్.ఓ. )
- మంకీ ఫాక్స్ వైరస్ 77 శాతం పెరిగింది..
- గణనీయ స్థాయిలో ప్రభావం ఉంటుంది.. 
- వ్యాధి బారిన పడ్డవారు దాదాపు 16 వేలమంది.. 
 
న్యూ ఢిల్లీ, 24 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా తేరుకోలేదు.. తాజాగా మంకీపాక్స్ అలజడి సృష్టిస్తోంది. పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి ఇతర దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  ప్రపంచ వ్యాప్తంగా బయటపడుతున్న కేసుల సరళిని విశ్లేషించగా... జూన్ చివరి వారం నుంచి జులై మొదటి వారం వరకు వైరస్ విస్తరణ వేగం 77శాతం పెరిగినట్లు గుర్తించారు. గణనీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ మహమ్మారి ఇప్పటి వరకు 75 దేశాలకు విస్తరించిందని, 16 వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసన్ తెలిపారు.

Tags :