అడవి జంతువు మెఖం పేరిట లేగ దూడ మాంసం అమ్మకం

అడవి జంతువు మెఖం పేరిట లేగ దూడ మాంసం అమ్మకం


డబ్బా గ్రామం గుర్లే తిరుపతికి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు 
అయిదుగురు నిందితులు అరెస్ట్ వారి నుంచి గొడ్డళ్లు స్వాధీనం
అడవి జంతువుల మాంసం కొనడం,అమ్మడం, తినడం కూడా నేరమే 
చింతలమానేపల్లీ మండలం ఎస్సై విజయ్ వెల్లడి. 

కొమురం భీం జిల్లా, 15 జూన్  (ఆదాబ్ హైదరాబాద్)

చింతలమానేపల్లీ మండలం, డబ్బా గ్రామానికి చెందిన గుర్లే తిరుపతికి చెందిన  లేగ దూడ కనిపించక పోవడంతో ఈ నేల 3 వ తేదీన  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు,ఈ పిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతుండగా ,ఆ రోజే డబ్బా గ్రామంలో అడవి జంతువుమెఖం మాసం అని  గ్రామంలో అయిదుగురు  వ్యక్తులు అమ్మకాలు జరిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వారిని  అదుపులో తీసుకొని విచారణ జరుపగా,అది అడవి జంతువుమెఖం మాంసం కాదని వారు లేగదూడను దొంగిలించి దానిని చంపి అడవి జంతువుమెఖం మాంసం అని అమ్మినట్లు, విచారణలో తేలింది. దీంతో బుధవారం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు కు తరలించడం జరిగిందని ఎస్సై విజయ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారి దగ్గర  నుంచి  కత్తి,మొట్టు,గొడ్డలి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై  తెలిపారు. ఈ  ఐదుగురిలో నిందితులు వడాయి విలాస్,సబ్బాని శ్రావణ్,బొల్లి కిష్టయ్య, మల్ల బోయిన కుమార్,పేసరి కిరణ్ అలియాస్ జగదీష్ లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎస్సై విజయ్ మాట్లాడుతూ  అడవి జంతువు మాంసం కొనడం,అమ్మడం, తినడం కూడా చట్టప్రకారం నేరమని ప్రజల యొక్క బలహీనతలను ఆసరా చేసుకుని కొందరు ఎద్దు మాంసాన్ని అడవి జంతువు మాంసంగా అమ్ముతున్నారని వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్సై తెలిపారు ఎవరైనా ఇలాంటి అగాయిత్యానికి పాల్పడితే వెంటనే సమాచారం అందిచాలని వారు స్థానికులకు విజ్ఞప్తి చేశారు,,.

Tags :