విషవాయువు..

బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ కలకలం
పలువురు ఉద్యోగులు అస్వస్థత
గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా
ఘటనాస్థలికి బయలుదేరిన మంత్రి గుడివాడ
అమరావతి
అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ తీవ్ర కలకలం రేపింది. క్వాంటం, సీడ్స్ యూనిట్లోకి ఒక్కసారిగా ఘాటైన వాయువు వెలువడిరది. దీంతో పలువురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సమీప పోరస్ కంపెనీ నుంచి వాయువు వెలువడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాంతులు, తల తిరుగుడుతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నలుగురు మహిళలకు సెజ్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది.సెజ్‌లోని పోరస్ కంపెనీ నుంచి అమ్మోనియం గ్యాస్ లీకైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తర తిరగడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బాధితులను యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. 20 అంబులెన్స్‌లతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రవి సుభాష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బ్రాండిక్స్ ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ బ్రాండిక్స్ లో అమ్మోనియం లీక్ తో రోగగ్రస్తులైన కార్మికులకు ప్రజలకు వెంటనే నాణ్యమైన వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.ఈ మేరకు సీపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడిరచారు. గ్యాస్ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు. బ్రాండిక్స్‌లో ఒక యూనిట్లో పనిచేస్తున్న మహిళలను అందరిని ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడ నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు. బాధితులకు భరోసా కల్పించాలని మంత్రి అమర్నాథ్కు ఆదేశించారు.