నేడు జైలు నుంచి విడుదల కానున్న 

నేడు జైలు నుంచి విడుదల కానున్న 

నేడు జైలు నుంచి విడుదల కానున్న 
ఫామ్ హౌస్ కేసు నిందితులు.. 
- ఇప్పటికే సింహయాజీ రిలీజ్.. 

హైదరాబాద్, 07 డిసెంబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నందకుమార్ లు నేడు  చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే  సింహయాజీ విడుదల కాగా మిగిలిన ఇద్దరు  నేడు  రిలీజ్ కానున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులుండటం వలన వీరిద్దరూ చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 

ఫాంహౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు  డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.   నిందితులంతా పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.

Tags :