జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే వీటిని తీసుకోవాలి..!

Updated:15/04/2018 12:55 PM

effective tips to increase memory power

నేటి త‌రుణంలో అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి.. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోవ‌డం. చిన్న విష‌యాన్నైనా గుర్తు పెట్టుకోనంత‌గా మ‌తిమ‌రుపు కూడా చాలా మందికి వ‌స్తున్న‌ది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల ఎవ‌రైనా ప‌నిలోనూ ఏకాగ్ర‌త సాధించ‌లేరు. ఇక విద్యార్థుల‌కు అయితే చ‌దివింది అస్స‌లు గుర్తుండ‌దు. దీంతో ప‌రీక్షల్లో రాణించ‌లేపోతారు. అలాంటి వారు కింద చెప్పిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక క్యారెట్‌, కాలిఫ్ల‌వ‌ర్ 10 నుంచి 12 ఆకులు, ఒక క‌ట్ట కొత్తి మీర తీసుకుని వాటిని క‌ట్ చేసి మిక్స్ చేయాలి. వీటిని ఉడికించి అనంత‌రం అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ‌కాయ ర‌సం క‌లిపి ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవాలి. వీటిలో ఉండే పోష‌కాలు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. యాక్టివ్‌గా ఉంటారు.

2. పాలు, పాల సంబంధ ఉత్ప‌త్తుల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిల్లో ఉండే పోష‌కాలు మెద‌డును యాక్టివ్‌గా ప‌నిచేసేలా చేస్తాయి. జ్ఞాప‌కశ‌క్తి పెరుగుతుంది.

3. రోజూ ఒక కోడిగుడ్డుతోపాటు జీడిప‌ప్పు, బాదంప‌ప్పు, పిస్తా వంటి న‌ట్స్‌ను తీసుకున్నా జ్ఞాప‌కశ‌క్తి పెరుగుతుంది.

4. ఓట్స్‌, బ్రౌన్ రైస్‌ల‌లో జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచే అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. క‌నుక వాటిని త‌ర‌చూ తీసుకుంటే సమ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. ట‌మాటా, క్యారెట్లు, బీన్స్‌, ఆకుకూర‌ల‌ను త‌ర‌చూ తీసుకుంటే జ్ఞాప‌క‌శ‌క్తి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.