మానవుడి ఉనికి ప్రశ్నార్థకం..

మానవుడి ఉనికి ప్రశ్నార్థకం..


( ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం పార్ట్ - 3 )
- ప్రపంచాన్ని శాసిస్తున్న మెడికల్ మాఫియా..! 
- మెడికల్ మాఫియా గుప్పిట్లో అధికార ప్రభుత్వాలు.. ! 
- దుర్మార్గమనే పదానికి బ్రాండ్ అంబాసిదార్లుగా మెడికల్ రక్కసులు..  
- నయవంచనతో సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు..
- వీరిని నిలువరించే నిజమైన నాయకుడెవరు..?

హైదరాబాద్, 27 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ప్రజారోగ్యాన్ని అటకెక్కించిన ప్రభుత్వాలు.. గొప్పలు చెప్పుకోవడానికే తమ సమయాన్ని వృధా చేస్తున్నారు.. రాజకీయ స్వార్థంకోసం అరాచకీయం చేస్తున్నారు.. ప్రతిపక్ష నాయకులను కొనడంలో.. కోటాను కోట్ల రూపాయలు వెనుకేసుకోవడంకోసం పథక రచనలు చేస్తున్నారు.. నమ్మి ఓట్లేసిన సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్నారు.. అవినీతి, కుట్రలు, కబ్జాలు, ఎత్తులు, జిత్తులతో నిండిపోయిన రాజకీయం కుళ్ళు కంపుకొడుతోంది.. ప్రతి సంఘటననూ తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమ రాజకీయ జీవితాలకు పునాదులు వేసుకుంటూ.. జనాలకు సమాధులు కడుతున్నారు.. ప్రజల ఆరోగ్యాలను బొంద  పెడుతున్న మెడికల్ మాఫియాతో చేతులు కలిపి.. రాక్షసక్రీడలో మునిగిపోతూ వికటాట్టహాసాలు చేస్తున్నారు.. (ఇంట్రో)

మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ టెన్ రిచ్చెస్ట్ పీపుల్ లిస్ట్ ఒకసారి చూద్దాం.. మెడికల్ మాఫియాకు ఈ రిచ్చెస్ట్ పీపుల్ కు ఏమిటి సంబంధం అని అనుమానం కలుగవచ్చు.. కానీ ఈ సంపన్నుల్లో మెడికల్ వ్యాపారం చేస్తున్నవారే ఉండటం ఇక్కడ గమనార్హం.. నెంబర్ ఒన్ మురళి దివిస్ కుటుంబం.. దివిస్ ల్యాబ్స్ ఫార్మా ఇండస్ట్రీ యాజమాన్యం.. రెండు బీ. పార్ధసారధి రెడ్డి ఆయన కుటుంబం.. హెటేరో ల్యాబ్స్ ఫార్మా ఇండస్ట్రీ యాజమాన్యం.. మూడు పీ. పిచ్చిరెడ్డి, పీ.వీ. కృష్ణారెడ్డి కుటుంబం మెగా ఇంజినీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. ఇది కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ.. ఇక నాలుగు కె. సతీష్ రెడ్డి ఆయన కుటుంబం.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ఫార్మా ఇండస్ట్రీ..  అయిదు జీ. అమరేందర్ రెడ్డి ఆయన కుటుంబం జీ.ఏ.ఆర్. కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ.. ఆరు ఎం. సత్యనారాయణ రెడ్డి ఆయన కుటుంబం ఎం.ఎస్.ఎన్. ల్యాబరేటరీస్..  ఫార్మా ఇండస్ట్రీ.. ఏడు జీ.వీ. ప్రసాద్ ఆయన కుటుంబం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్.. ఫార్మా ఇండస్ట్రీ.. ఇక ఎనిమిది జాస్తి వెంకటేశ్వర్లు ఆయన ఫ్యామిలీ         ఫార్మాస్యుటికల్స్, ఫార్మా ఇండస్ట్రీ.. తొమ్మిది పీ.వీ.ఎన్. రాజు ఆయన కుటుంబం.. గ్లాండ్ ఫార్మా.. ఫార్మా ఇండస్ట్రీ.. ఇక పదవ వారు వీసీ నన్నపనేని, న్యాట్కో ఫార్మా ఇండస్ట్రీ..  చూశారుగా టాప్ టెన్ సంపన్నుల్లో 8 మంది ఫార్మా ఇండస్ట్రీ కి సంబంధించిన వారీ ఉన్నారు.. మీరు బాగా గమనించండి మీ ప్రాంతాల్లో స్కూల్స్ కంటే ఆసుపత్రులు ఎక్కువుగా ఉంటాయి..  దీన్ని బట్టి అర్ధం అవుతోంది ఏమిటంటే భారత దేశంలో ఆరోగ్య పరిరక్షణ ఖరీదైన వ్యవస్థగా మారిపోయింది.. అది  అనేది మూడు పూవులు, ఆరు కాయలుగా సాగిపోతోంది.. ఇప్పుడు  జపాన్, సింగపూర్, ఇజ్రాయల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ లాంటి చాలా దేశాల్లో హెల్త్ కేర్ అనేది ఉచితం..  కానీ మనదేశంలో మాత్రం  హెల్త్ కేర్ అన్నది లాభదాయకమైన వ్యాపారంగా మారిపోయింది.. 

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుందాం.. మొదటిగా చెప్పుకున్న దివిస్ ల్యాబరేటరీస్.. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, అంకిరెడ్డి గూడెంలో నడపబడుతోంది.. ఈ కంపెనీ యాజమాన్యం బిస్కెట్ ఫ్యాక్టరీ స్థాపిస్తున్నామని చెప్పి, అందరినీ మోసం చేసి.. ఫార్మా ఇండస్ట్రీ నెలకొలిపి, ఉత్పత్తులు ప్రారంభించింది.. ఈ కంపెనీ విడుదల చేస్తున్న కాలుష్యంతో ఆ చుట్టుపక్కల గ్రామాల భూములన్నీ విషతుల్యం అయిపోయాయి.. అక్కడి వాతావరణం కలుషితమైపోయింది.. దివిస్ యజమాని మురళి పరిశ్రమ స్థాపిస్తున్న సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారు.. విచ్చలవిడిగా వ్యర్ధాలను ఆప్రాంతంలో వెదజల్లుతూ కాలుష్యంతో నింపుతూ ఆ ప్రాంత ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.. ఆ ప్రాంత భూములు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.. జంతువులు కూడా జీవించలేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఇక పంటల మాట చెప్పుకోవాల్సిన పనిలేదు.. రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించడం లేదు..  స్థానిక ఉద్యోగ కల్పన ఊసే లేదు.. పైగా దురాక్రమణ పర్వానికి తెరకూడా లేపారు.. అక్రమ కట్టడాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు..  ప్రభుత్వాలను, వ్యవస్థలను డబ్బుతో కొనేస్తూ తన అరాచకత్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.. దివిస్ పై ఎన్నిపిర్యాదులు వచ్చినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు..  కోర్టులో కేసులు వున్నా చలించడం లేదు.. అధికార ప్రభుత్వాలను శాసిస్తున్నారు.. ఢిల్లీ కి ఫిర్యాదులు వెళ్లినా చర్యలు శూన్యం.. చివరికి భరించలేని ఒక రైతు.. ఇటీవల నూతన రాష్ట్రపతిగా పదవి అలంకరించిన ద్రౌపది ముర్ము కూడా ఫిర్యాదు చేశాడంటే ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు..  

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. వారి సమాధులను పునాదిగా చేసుకుంటూ తమ ధన దాహపు సౌధాలను నిర్మించుకుంటున్న మెడికల్ మాఫియాకు అడ్డుకట్ట పడేనా అన్నది  మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది..

Tags :