ద్రౌపతి ముర్ముకు ఘన స్వాగతం..

- విజయవాడ గేట్ వే హోటల్ లో స్వాగతం పలికిన చంద్రబాబు నాయుడు..
- ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
అమరావతి, 12 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ):
రాష్ట్రపతి ఎన్.డీ.ఏ. అభ్యర్హ్ది ద్రౌపది ముర్ముకు టిడిపి నేతలు ఘన స్వాగతం పలికారు.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మంగళవారం విజయవాడ గేట్ వే హోటల్ లో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు, ఎంపి కేశినేని, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు తదితర టీడీపీ నేతలు ఉన్నారు.
Tags :