సొంత ఓనర్‌ను గన్‌తో కాల్చేసిన పెట్ డాగ్

Updated:12/05/2018 10:12 AM

dog shots its owner

తన పెట్ డాగే ఆ వ్యక్తిని గన్‌తో కాల్చేసింది. ఈ ఘటన యూఎస్‌లోని వాషింగ్టన్‌లో చోటు చేసుకున్నది. అయితే.. ఆ కుక్క తన ఓనర్‌ను కావాలని కాల్చలేదు. అలవాటులో పొరపాటు జరిగింది. తన పెట్ డాగ్‌తో సరదాగా ఆడుకుంటుండగా కుక్క చేతిలో ఉన్న గన్ పేలడంతో 51 ఏండ్లు ఉన్న రిచార్డ్ రెమ్మె అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ 911 కు కాల్ చేసి కుక్క తనను కాల్చేసిందని.. వెంటనే అంబులెన్స్ పంపిచాలని ఆ వ్యక్తి కోరడం గమనార్హం. 

"నేను సోఫాలో కూర్చొని ఉన్నాను. మా పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నాను. అది నా మీద ఎగురుతున్నది. ఇంతలోనే నా బెల్ట్‌లో ఉన్న 9ఎంఎం పిస్తోల్ పైకి ఎగిరింది. దాన్ని అది అందుకోబోయింది. ఇంతలోనే దాని కాలివేలు పిస్తోల్ ట్రిగ్గర్‌కు తగలడంతో బుల్లెట్ నా శరీరంలోకి దూసుకెళ్లింది.." అంటూ జరిగిన ఘటనను వివరించాడు రిచార్డ్.

అయితే.. ఒకటే బుల్లెట్ రిచార్డ్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఎక్కువగా గాయాలేమీ కాలేదు.

 

సంబంధిత వార్తలు

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR