పట్టా మార్పిడికి పదమూడు లక్షల లంచం..

పట్టా మార్పిడికి పదమూడు లక్షల లంచం..

 - ఏసీపీ వలలో చిక్కిన తాడూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ జయలక్ష్మి..
- వెంకటయ్య అనే రైతు నుంచి 13 లక్షల రూపాయల లంచం డిమాండ్.. 
- లక్ష రూపాయలు ఆమెకు ఇస్తూ.. ఏసీబీ అధికారులకు 
  ఇంఫార్మ్ చేసిన బాధితుడు వెంకటయ్య..
- జయలక్ష్మిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్న అధికారులు.. 
 
నాగర్ కర్నూలు, 20 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది తాడూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి...  ఈమె కలెక్టరేట్ కార్యాలయంలో సి బ్లాక్ లో ఇంచార్జ్ సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తూ..  ఇక్కడే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.. .తిమ్మాజీపేట మండలం, మారేపల్లి గ్రామంలో ఓ వివాదంలో ఉన్న భూమి విషయంలో..  వెంకటయ్య అనే వ్యక్తి నుంచి  పట్ట మార్పిడికై  రూ. 13 లక్షలు డిమాండ్ చేసింది.. సోమవారం సాయంత్రం ఒక లక్ష రూపాయలు డిప్యూటీ తాసిల్దారు జయలక్ష్మికి ఇస్తూ.. మారేపల్లి గ్రామానికి చెందిన  బాధితుడు వెంకటయ్య ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు.. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా జయలక్ష్మిని పట్టుకుని, అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు..

Tags :