Tuesday, March 19, 2024

రాజ్యాంగ సవరణ జరగపోవడం అత్యంత దారుణం..

తప్పక చదవండి

బీసీల అవకాశాలు మృగ్యమవుతున్నాయి..

  • మోదీజీ జర పట్టించుకోండి అంటూ రిక్వెస్ట్ చేసిన దాసు సురేశ్..
  • వరంగల్ కు వస్తున్న మోడీని నిలదీయడానికి వెనుకాడం..
  • మోడీ హయాంలో బీసీల రిజర్వేషన్లకు అవసరమైన చిన్న

పలు ప్రాజెక్టుల ప్రారంభత్సవాల నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి వరంగల్ కు విచ్చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.. ఇదే తరుణంలో బీసీల ఆకాంక్షలను వ్యక్తపరుస్తామని బీసీ ప్రధాని హయాంలో కోల్పోతున్న అవకాశాలపై నిలదీయడానికి సైతం వెనుకాడమని పేర్కొన్నారు ..

- Advertisement -

మోదీ మాదిరిగా బీసీలు సహితం అసెంబ్లీ పార్లమెంటులలో అడుగెట్టానుకుంటున్నారనీ అయితే చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లకు అవసరమైన ఒక చిన్న రాజ్యాంగ సవరణ మోదీ హయాంలో జరగకపోవడం బాధాకరమన్నారు..చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు మోదీ హయాంలో కాక ఇంకెన్నడు సాధ్యపడుతుందని దీనికి ప్రధాని సహకరించరా అని ప్రశ్నించారు.. బీసీల జనగణన చేపడతామని 2018లో హోంమంత్రి రాజ్ నాథ్ చేత పార్లమెంట్ లో ప్రకటింపజేసి నేటికీ బీసీ గణన చేపట్టడంలో మోదీ విఫలమవుతున్నారన్నారు.. రూ. 8 లక్షల ఆదాయపు క్రిమీలేయర్ పరిమితి ద్వారా లక్షల మంది బీసీ ఉద్యోగులు వాళ్ల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.. ప్రధాని చొరవ తీసుకొని ఈ పరిమితిని రూ. 15 లక్షలకు పెంచేలా బీసీలకు సహకరించాలన్నారు.. ! ఈ.డబ్ల్యు.ఎస్. కోటాతో అన్ని కేంద్ర కళాశాలలు, ఉద్యోగాలలో బీసీల అవకాశాలు గల్లంతు అవుతుంటే.. మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం భాదాకరమన్నారు.. మోదీకి నివేదించాల్సిన అంశాలపై తమ ముఖ్య నాయకత్వం బుధవారం హైదరాబాద్ లో సమావేశం కానుందని.. ఇందులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మోదీ వరంగల్ పర్యటనలో తమ కార్యాచరణ ఉండబోతుందని మీడియాకు తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు