కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా కంపెనీ: ఈటల రాజేందర్

Updated:15/05/2018 02:52 AM

congress  party is a drama company

ప్రజా సమస్యలను, కన్నీళ్లను పట్టించుకున్న పాపాన పోనీ దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా కంపెనీ అని దుయ్యబట్టారు.. ప్రజలు వారిని నమ్మరని ఆయన పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో చేపట్టిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు పథకం కింద రైతులకు ఇచ్చే రూ. 12 వేల కోట్లు ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏవైనా ఆరోపణలు చేసేప్పుడు యోచించాలే. అలాంటి వాళ్లను చూసి తెలంగాణ సిగ్గు పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక రైతు రుణమాఫీ కోసం మూడు సంవత్సరాలు జమ చేస్తే ఇదీ ఎన్నికల స్టంట్ అన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాధానం చెప్పగలవా అని ఈటల ప్రశ్నించారు. రూ. 3 వేల కోట్లు మీరు ఇస్తే గొప్పొడివి అని మేము అన్నాం.. కాగా రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేస్తే తమను కాంగ్రెస్ నాయకులు శాపనార్థాలు పెడుతున్నరన్నారు. దాదపు 60 ఏళ్లు ఇతర పార్టీల పాలనలో ఏనాడైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ముఖమేనా వాళ్లదని విరుచుకుపడ్డారు. పచ్చ కామెర్లవానికి లోకం అంతా పచ్చగానే కనపడుతున్నట్లు ఉన్నది కాంగ్రెస్ పరిస్థితని మంత్రి ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.