పలకరింపులెందుకు.. పరిహారం కావాలి.. ( రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. )

పలకరింపులెందుకు.. పరిహారం కావాలి..  ( రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. )

 

- సెంట్రల్ కోర్ట్ లో మూడున్నర గంటల సుదీర్ఘ సమావేశం.. 
- దేశం మీద విదేశీయుల కుట్ర అంటున్న కేసీఆర్ వివరాలు తెలపాలి.. 
-  క్లౌడ్ బరెస్ట్  అంటున్న జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలి : రేవంత్.. 
- వరదలపై వాయిదా తీర్మానం ఉంటుంది : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. 
- నాలుగు దశాబ్దాల్లో ఇదే పెద్ద వరద : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. 
-  క్లౌడ్ బరెస్ట్ అంటూ కేసీఆర్ సిల్లీ కామెంట్లు : ఉత్తమ్ కుమార్ రెడ్డి..

హైదరాబాద్, 17 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
సెంట్రల్ కోర్ట్ లక్దికాపూల్, మూడున్నర గంటల పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుదీర్ఘ సమావేశం జరిగింది.. పార్లమెంట్  సమావేశల మొదటి రోజే తెలంగాణ వరదలు పై సోనియాగాంధీ అనుమతితో వాయిదా తీర్మానం ప్రవేశపెడతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.. వరదల్లో మరణించిన జర్నలిస్టు జమిర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది.. సింగరేణి రెస్క్యూ లో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. టి.ఆర్.ఎస్. ను జాతీయ పార్టీగా మలుచుకోవడానికి కేసీఆర్ సమీక్షలు చేస్తున్నాడు తప్ప, వరదలపై సమీక్షలు చేయలేదని రేవంత్ విమర్శించారు.. విపత్తు కింద 2 వేల కోట్ల సహాయం అడగలేదు.. తమ  పార్టీ నేతలు సహాయ చర్యలు చేపట్టడం వల్ల..  సీఎం బయటకు వచ్చి వరద ప్రాంతాలకు వెళ్ళాడు.. పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తాడని ఆశించాం.. కాళేశ్వరం ప్రాజెక్టులో వరదల్లో మునిపోవడం, జరిగిన అవినీతి కప్పి పుచ్చుకోవడానికి క్లౌడ్ బరెస్టు కి విదేశాలు కుట్ర చేశాయని చెపుతున్నారు.. వరదల్లో ప్రజలను పక్కదారి పట్టించుకోవడానికి ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంపూర్ణ సమాచారం ఉందని మేము భావిస్తున్నాం.. దేశం మీద విదేశీయుల కుట్ర ఉందంటే ఇంటెలిజెన్స్, రా కి సమాచారం అందించాలి..  కేంద్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది.. ఈ కుట్ర వెనుకాల ఎవరున్నారని కేసీఆర్ ని కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని రేవంత్ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు..  జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ పై విచారణ జరపాలి.. గోదావరి, కృష్ణ పై క్లౌడ్ బరెస్టు చేస్తే..  తెలంగాణ, ఏపీలకు  నష్టం జరిగే అవకాశం ఉంది.. 

ఈ సమావేశంలో సిరిసిల్ల సభకు సంబంధించి చర్చ జరిగిందని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని రేవంత్ తెలిపారు.. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత సభ వాయిదాపై ప్రకటిస్తాం... క్షేత్రస్థాయిలో మా పార్టి శ్రేణులు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు.. కేసీఆర్, బండి సంజయ్ బడేమియా, చోటేమియాలాగా ఇద్దరు మిత్రులే.. మోడీ, కేసీఆర్ ఇద్దరి వైఫల్యాలు ఉన్నాయి.. గుజరాత్ కి వరదలు రాగానే రూ. 1000 కోట్లు విడుదల  చేశారు.. తెలంగాణకు ఆర్థిక సహాయం చేయలేదు.. కనీసం డిజాస్టర్ బృందాలను కూడా పంపించలేదు..

నేడు వరదలపై వాయిదా తీర్మానం ఉంటుంది : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

దాదాపు మూడున్నర గంటల పాటు ప్రజా సమస్యలపై చర్చించాం.. వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సహాయ, సహకారాలపై, ఆకలి, ఆరోగ్యం, జరిగిన నష్టంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. వరదల వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు.. ఇల్లు కూలిపోయాయి.. క్యాంపులలో ఉన్న వారికి సరైన సమయానికి ఆహారం, పాలు, నీళ్లు అందించకపోవడం వల్ల ఇబ్బంది ఉంది.. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.. బ్యాక్ వాటర్ తో గ్రామాల్లోకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ గతంలోనే తెలిపింది.. ప్రభుత్వ అశ్రద్ధ వల్ల చాలా జిల్లాల్లో వరదలు వచ్చాయి.. ప్రజలను రక్షించడానికి లాంచీలు, హెలికాప్టర్ లు ఏర్పాటు లేదు.. పంట నష్టంపై ఇంత వరకు అంచనా కమిటీ వేయలేదు.. పంట నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులను పంపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది..  ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరా అవస్ యోజన కింద గతంలో ఇల్లు ఇచ్చాము.. ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇవ్వడం లేదు.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. ప్రతి కుటుంబానికి 25 వేలు అందివ్వాలి..  లక్షల కోట్లు పెట్టిన ప్రాజెక్టు వరదల్లో మునిగిపోయింది..  ప్రాణహి చేవెళ్ల ప్రాజెక్టు ద్వారానే బాగుండేది.. ఎస్టిమేషన్ పెంచి 35 వేల కోట్ల నుండి లక్ష కోట్లకు పెంచారు...వరదల్లో నష్టపోయిన దగ్గర క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాం.. రుణమాఫీ జరగకపోవడం వల్ల బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. వెంటనే వడ్డీతో కూడిన రుణమాఫీ చెల్లించాలి.. పోడు భూములపై మహిళలను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. వారికి పోడు పట్టాలు వచ్చే వరకు కాంగ్రెస్ పక్షాన పోరాడతాం.. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలి.. ఇరిగేషన్ ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలు అవినీతిపై లోకసభ లో ప్రస్తావిస్తాం..

గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఇంత పెద్ద వరదలు రావడం గమనించలేదు.. : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తీవ్ర పంట నష్టం ప్రాణ నష్టం జరిగింది.. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి.. వారి నుండి ఆర్థిక సహాయం పొందాలి.. కేటిఆర్ రాష్ట్రంలో పంట నష్టమే జరగలేదని అంటున్నారు..  దీని వల్ల కేంద్ర ఆర్థిక సహాయానికి ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంది.. పసల్ భీమా పథకం అమలు లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.. ఎకరాకు కనీసం 20 వేల ఆర్థిక సహాయం అందించాలి.. ఎరువులు, విత్తనాలు అందించాలి.. వరదలపై ప్రభుత్వానికి  అధికారుల నుండి సమాచారం ఉందా..? క్లౌడ్ బరెస్ట్ ఎక్కడ ఉందో కేసీఆర్ బయట పెట్టాలి.. జాతీయ భద్రతను రాజకీయ అంశం గా కేసీఆర్ అభివర్ణిస్తున్నారు..
మత్య కార్మికులకు జీవనోపాధి కల్పించాలి..వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి.. ప్రభుత్వం ఇచ్చే చేపలు దళారుల పాలవుతున్నాయి.. 

సిల్లీ కామెంట్లు చేసిన కేసీఆర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 
విదేశీ కుట్రతో క్లౌడ్ బరెస్ట్ అనేది సిల్లీ కామెంట్ అన్నారు నల్లగొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలని సీఎం కేసీఆర్ చూశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది కాబట్టే.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేసీఆర్ క్లౌడ్ బరెస్టు అన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా  మాట్లాడడం సరైంది కాదని... కుట్రలతో క్లౌడ్ బరస్ట్ అనేది సాధ్యం కాదన్నారు ఉత్తమ్. అటు భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్... దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందని, ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా కుట్ర చేసినట్లు కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

Tags :