సినీ నటుడు సత్యనారాయన బ్రతికే ఉన్నాడు

Updated:13/03/2018 05:08 AM

cinema artist sathyanarayana is safe

నవ్వు నాలుగు విధాల చేటు అన్న సామెత గుర్తుంది కదా! అంటే విచక్షణ లేకుండా, సందర్భానుసారంగా ఎప్పుడు పడితే నవ్వటం అపకీర్తిని తెచ్చిపెడుతుంది అని అర్థం. ఇప్పుడు దీన్ని సవరించి సోషల్ మీడియా నాలుగు విధాల చేటు అని పెట్టాలేమో! ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే అర్థరహిత, నిజంకాని పోస్టులు ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

సీనియర్ నటుడు,నవరస నటనా సార్వభౌమ, విశ్వవిఖ్యాత నటసామ్రాట్ శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందారని నిన్న సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఒకింత షాక్ కు గురయిన తెలుగు ప్రజలు మీ ఆత్మకు శాంతి కలగాలి, రిప్ అంటూ తెగ పోస్టులు చేశారు. ఆయన ఇంకా బ్రతికుండగానే కొందరు చంపేశారు. దీనిపై దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) వివరణ ఇచ్చింది. కైకాల సత్యనారాయణ చనిపోలేదనీ, ఆయన క్షేమంగానే ఉన్నట్టు స్పష్టంచేసింది.

సోమవారం చనిపోయింది మరో సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ అని క్లారిటీ ఇచ్చింది. కాగా వంకాయల సత్యనారాయణ గత కొన్ని నెలలనుండి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుండి బాధపడుతున్నారు. దీనికి సంబంధించి వైద్యం చేయించుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి సోమవారం నాడు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. కాగా ఆయన చనిపోతే బతికున్న కైకాల గారు చనిపోయినట్లు వార్తలు సృష్టించడం ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తుంది.