ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ దోపిడి

Updated:11/03/2018 07:02 AM

chory at govt. rtc employee home

పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి జితేందర్‌రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళంవేసి తిరుపతి వెళ్లిన సమయంలో శుక్రవారం అర్థరాత్రి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులుఈ చోరీకు పాల్పడ్డారు. పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ వెల్లడించిన వివరాల మేరకు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో దాచి ఉంచిన 57 తులాల బంగారం, రూ.1.50లక్షల నగదును అపహరించుకు పోయారు. శనివారం ఉదయం జితేందర్‌రెడ్డి ఇంట్లో చోరీ జరిగినట్లుగా గుర్తించిన స్థానికులు ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీధర్‌కుమార్‌ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. చోరీ చేసిన బంగారం, నగదు విలువ రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.