చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో ఫెడరేషన్ ముట్టడి..

చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో ఫెడరేషన్ ముట్టడి..


( కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది సినీ కార్మికులు.. )

హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
చిత్రపురి సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో..  చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను ముఖ్యంగా సినిమా కార్మికుల వేతనాల పెంపు కోసం తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని  వేలాది మంది కార్మికుల చేత ముట్టడించడం జరిగింది. అనంతరం కార్మికులను ఉద్దేశించి సంస్థ నాయకులు, అధ్యక్షులు డాక్టర్ కస్తూరి శ్రీనివాస్,  ప్రధాన కార్యదర్శి భద్ర,  కోశాధికారి సంకూరి రవీందర్,  కార్యవర్గ సభ్యులు నామాల రాము, గుర్రం రాజు, అంజి యాదవ్, చంద్రకళ, ఉమశంకర్, మల్లిక, సిహెచ్ శ్రీనివాస్, రవి, షేక్ సుభాని పాల్గొని వేలాదిమంది కార్మికులు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ..  గత నాలుగు సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కార్మికుల శ్రమ దోచుకుంటూ..  దొంగలే చిత్ర పరిశ్రమలో నాయకులుగా కొనసాగితే ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఉంటుందని, గత మూడు సంవత్సరాలుగా సాధన సమితి పిలుపు మేరకు తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం కూడా ఒక తాటి మీదకు నిలవడం కార్మిక శక్తిని ఘనంగా చాటి చెబుతుంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు వెంటనే స్పందించి ప్రస్తుతం ఫెడరేషన్ లో  నాయకులుగా చలామణి అవుతున్న వారు తక్షణమే స్పందించాల్సిన బాధ్యత వారి మీద ఉంది..  కనీసం రోజు కూలీకి వచ్చేటువంటి ఆదాయం కూడా సినిమా కార్మికులు లేకపోవడం ఎంత దౌర్భాగ్యమైన స్థితి..  కష్టకాలంలో పేద సినిమా కార్మికులకు కనీసం ఉండడానికి సొంతిల్లు లేకపోవడం కూడా చాలా బాధాకరమైనది..  కార్మికుల పేర్లమీద దోచుకుంటున్న దొంగలు కార్మికుల గురించి నీతి ప్రవచనాలు వల్లించడం హాస్యాస్పదంగా ఉంది. ఎప్పుడైతే ఈ రోజుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పట్ల, కార్మికుల కష్టాల పట్ల సమస్యల పట్ల స్పందించకపోవడం సిగ్గుచేటు..  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల చేత కమిటీ నియమించి, చిత్ర పరిశ్రమలోని సినిమా కార్మికులందరికీ డబుల్ బెడ్రూం వెంటనే కేటాయించి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రోజు 1500 తగ్గకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సినీ పరిశ్రమలోని పెద్దలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరి మీద ఉంది. ఇదే పోరాట స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోని 24 యూనియన్ లో ఉన్న నిజమైన సినిమా కార్మికులు, పేద కార్మికులు మన హక్కుల సాధన కోసం మనకు న్యాయం జరిగేంత వరకు ఉత్సాహంతో ఉద్యమించాలని, ఇప్పటి దాకా చిత్రపురి సాధన సమితి ఎన్నో పోరాటాలు చేసిందని, సినిమా కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. సాయంత్రం కల్లా అగ్రిమెంట్ పత్రాలు నాయకులు తీసుకురాకపోతే వెంటనే రాజీనామా చేసి, సినిమా పరిశ్రమకు సినిమా కార్మికులకు  క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేనిపక్షంలో మరొక పది రోజులు టైమ్ తీసుకుని మళ్ళీ ఉద్యమాలు చేసి, తమ హక్కులు సాధించుకునేంతవరకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు..  అని తెలపడం జరిగింది..

Tags :