టైం మెషిన్ కథాంశంతో చిరంజీవి కొత్త సినిమా

Updated:12/05/2018 02:42 AM

chiranjeevi new movie based on time machine

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ తేజ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కతుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగానే మరో వైపు చిరు తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. మహానటి సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకోవడమే గాక ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు నాగ్ అశ్విన్ మెగా స్టార్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 

కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో నటించిన మహానటి చిత్రం మే 9వ తేదీన విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద చక్కని విజయం సాధించింది. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న, ప్రియాంకలు మెగాస్టార్ చిరును ఆయ‌న ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి వారికి చిత్ర విజయం పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం తన తదుపరి చిత్ర వివరాలను చిరంజీవి వెల్లడించారు. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉంటుందని చిరంజీవి ప్రకటించారు. ఆ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తుందని అన్నారు. తాను గతంలో ఆ సంస్థ బ్యానర్‌లో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలో అదే బ్యానర్‌పై తన తదుపరి సినిమా ఉంటుందని అన్నారు. ఆ సినిమా ఎన్‌టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమాను పోలి ఉంటుందని, టైం మెషిన్ కథాంశంతో సినిమా సాగుతుందని తెలిపారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి ఏడాది పడుతుందని అన్నారు. కాగా మరో వైపు చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

సాయి కుమార్ త‌నయుడు కొత్త సినిమా ప్రారంభం

సాయి కుమార్ త‌నయుడు కొత్త సినిమా ప్రారంభం

కేవ‌లం ఎనిమిది మందినే ఫాలో అవుతున్న మ‌హేష్ బాబు

కేవ‌లం ఎనిమిది మందినే ఫాలో అవుతున్న మ‌హేష్ బాబు

అల‌నాటి న‌టిని ప‌ట్టించుకోని త‌న‌యుడు.. అనాథ‌లా మృతి

అల‌నాటి న‌టిని ప‌ట్టించుకోని త‌న‌యుడు.. అనాథ‌లా మృతి

వెంకీ-చైతూల‌కి జోడి ఫిక్స్ అయిన‌ట్టేనా

వెంకీ-చైతూల‌కి జోడి ఫిక్స్ అయిన‌ట్టేనా

ర‌జ‌నీకాంత్ సినిమాలో చేయ‌డానికి కార‌ణం చెప్పిన స్టార్ హీరో

ర‌జ‌నీకాంత్ సినిమాలో చేయ‌డానికి కార‌ణం చెప్పిన స్టార్ హీరో

తాత నోట రంగ‌మ్మ పాట‌.. ఫిదా అయిన స‌మంత‌

తాత నోట రంగ‌మ్మ పాట‌.. ఫిదా అయిన స‌మంత‌

కొరటాల శివ దర్శకత్వంలో..

కొరటాల శివ దర్శకత్వంలో..

సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసాం: పూజా హెగ్డే

సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసాం: పూజా హెగ్డే

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR