ఆచార్య దేవోభవ..

ఆచార్య దేవోభవ..

 
( చెన్నై అన్నా యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ.. )
- ఉపాధ్యాయులను కొనియాడిన ప్రధాని.. 
- కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు.. 
- రేపటితరం నాయకులను టీచర్లే తయారు చేస్తారు.. 
- కోవిడ్ సమయంలో వారు విశిష్ట సేవలందించారు.. 
- 70 మంది విద్యార్థులకు బంగారు పాతకాలందజేత.. 
- స్టార్తప్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందన్న మోడీ.. 
 
చెన్నై, 29 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గడిచిన ఆరేళ్లలో  స్టార్టప్ ల సంఖ్య  15 శాతం పెరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. తమిళనాడు  చెన్నైలోని  అన్నా యూనివర్సిటీలో జరిగిన 42వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు  తమిళనాడు  సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను కొనియాడుతూ ప్రధాని కొన్ని కామెంట్స్ చేశారు. దేశానికి రేపటితరం నాయకులను తయారుచేసేది ఉపాధ్యాయులేనని ప్రశంసించారు.

కొవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని ప్రధాని మోడీ అన్నారు. ఆ సమయంలో విశిష్ట సేవలందించిన ప్రజలు, సైంటిస్టులు, హెల్త్ వర్కర్లకు మోడీ ధన్యావాదాలు తెలిపారు. కొవిడ్ కు వ్యతిరేకంగా పోరాడ‌టంలో వీరి కృషి గ‌ణ‌నీయమైన‌దని ప్రధాని వ్యాఖ్యానించారు. యావత్ ప్రపంచం భారత యువత వైపు ఆశగా చూస్తోందన్నారు. దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్న ప్రధాని.. రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా  భారత్ మారిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన 70 మంది విద్యార్థులకు ప్రధాని మోడీ బంగారు పతకాలను అందజేశారు.

Tags :