సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నీట్ - 2018 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లిష్, హిందీతో పాటు తొమ్మిది భాషల్లో ప్రశ్నపత్రం ముద్రించనున్నామని, విద్యార్థులు దరఖాస్తు సమయంలోనే వారి భాషను ఎంపిక చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
దరఖాస్తులను మార్చి 9 వరకు ఆన్ లైన్ లో చేసుకోవచ్చని, ఏప్రిల్ రెండో వారంలో హాల్ టికెట్లును డౌన్ లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్ఈ అధికారులు సూచించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి సీబీఎస్సీ మే 6న నీట్ పరీక్షను నిర్వహించనుంది. జూన్ 5న పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలిపింది.