Thursday, April 25, 2024

బీజేపీలో చేరిన కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్..

తప్పక చదవండి
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన డీకే అరుణ..!
  • కార్యక్రమంలో పాల్గొన్న రాంచందర్ రావు, గౌతమ్ రావు..

హైదరాబాద్ : కేసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో చికోటి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందచర్‌రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా గౌతం రావు.. ప్రవీణ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశ విదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ ప్రవేశాన్ని బిజెపి నాయకులలో ఒక వర్గం వ్యతిరేకించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఫలించలేదు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరాల్సి ఉండగా.. తీరా చికోటీ బీజేపీ కార్యాలయానికి చేరుకునే వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన ఆఫీస్ నుండి వెళ్లిపోవడంతో చికోటీ చేరిక నిలిచిపోయింది. ఈడీ కేసులు, క్యాసినో వ్యహరంలో కేసులు ఉండటంతో చికోటీ చేరికను తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం వ్యతిరేకించిందని.. దీనితోనే అప్పుడు చికోటి జాయినింగ్ అర్థాంతరంగా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఆ తరువాత హస్తినలో చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరిక గురించి బండి సంజయ్, డీకే అరుణలతో సంప్రదింపులు జరిపాడు. ఢిల్లీ పెద్దలతో చీకోటి చేరికపై మాట్లాడిన బండి సంజయ్ వారు ఓకే చెప్పడంతో చీకోటి చేరికకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ బీజేపీ కండువా కప్పి చీకోటిని పార్టీలోకి ఆహ్వానించారు. మరి చీకోటికి బీజేపీ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు