డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 132 మందిపై కేసులు నమోదు

Updated:13/05/2018 11:02 AM

cases on 132 members in drunk and drive

నగరంలోని పలు ప్రాంతాల్లో గడిచిన రాత్రి ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో 132 మందిపై కేసులు నమోదయ్యాయి. మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై చేపట్టిన తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందిపై కేసులు నమోదు చేశారు. 20 బైక్‌లు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆరుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోతాదుకు మించి మద్యం సేవించిన 110 మందిపై కేసులు నమోదు చేశారు. 80 కార్లు, 30 బైక్‌లను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ డైమండ్ హౌజ్ వద్ద జరిపిన తనిఖీల్లో నటుడు దామరాజు కీర్తి పట్టుబడ్డాడు.